Rahu Ketu Gochar Transit 2023: అప్పుడే రాహు, కేతు గ్రహాల సంచారం.. డిసెంబర్ 30 లోపు ఈ రాశుల వారికి రాజయోగం పట్టనుంది
Rahu Ketu Gochar Transit 2023: ప్రతి సంవత్సరం రాశు, కేతు గ్రహాలు తమ రాశు వదిలి ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ సంచారం ప్రభావం మూడు రాశువారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో పాటించాల్సిన పలు జాగ్రత్తలు ఇవే.
Rahu Transit In Pisces: ప్రతి సంవత్సరం రాహు, కేతు గ్రహాలు 15 నెలల తర్వాత ఇతర రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ గ్రహాలు తిరోగమనం చెందడం చాలా అరుదు. కానీ ఇవి తిరోగమనం చెందడం వల్ల 12 గ్రహాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. 2022 సంవత్సరంలో రాహువు, కేతువు గ్రహాలు పలు సంవత్సరాల తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ఈ తిరోగమనం 2023లో జరుగుతుందని జోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహాల సంచారాలకు కూడా శని సంచారానికి ఉండే ప్రాముఖ్యత ఉంది. దీని కారణంగా అన్ని రాశులవారికి శుభ, అశుభాలు జరిగే అవకాశాలున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అక్టోబర్ 30, 2023 మధ్యాహ్నం 12.30 గంటలకు రాహువు తిరోగమనంలో కదులుతూ మేషరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే ఈ సంచారం వల్ల ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాహు సంచారం వల్ల ఈ రాశువారికి అదృష్టం వరించబోతోందా..?
మేషం:
రాహు సంచారం వల్ల మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రాశి వారి ఆదాయంలో చాలా రకాల మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాల్లో అధికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. రాహువు సంచారం వల్ల ఆర్థిక స్థితిని నిరంతరం బలోపేతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవంలో కూడా పెరుగుతుంది.
కర్కాటక రాశి:
రాహు గ్రహం ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశిలో కూడా తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్‌లో పెద్ద పురోగతి పొందబోతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ రంగంలో ప్రమోషన్ పొందవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు 2023లో కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. కొత్త ఇల్లు లేదా కారు కొనడానికి ఇవే మంచి రోజులు.. కాబట్టి కొత్త ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్నవారు తప్పకుండా ఈ క్రమంలో కొనుగోలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంచారం వల్ల నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మీనం:
రాహువు సంచారం తర్వాత మీనరాశి వారిలో కూడా తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా రకాల ప్రయోనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీన రాశి వారి ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలో వీరు పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి