Rahu Rashi Parivartan 2023: జ్యోతిషశాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా  భావిస్తారు. ప్రస్తుతం రాహు మేషరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలోనే అతడు రాశిని మార్చబోతున్నాడు. అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు కుజుడు మేషరాశి నుంచి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహువు మీన రాశి ప్రవేశం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు మీన రాశిలోకి ప్రవేశించడం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
కర్కాటకం
రాహువు ప్రవేశం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు ఈ సమయంలో ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాహు సంచారం వల్ల పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
మీనరాశి
ఇదే రాశిలో రాహు సంచారం జరగనుంది. దీంతో మీరు ఆర్థికంగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: April Gochar 2023: ఏప్రిల్‌లో 'విధ్వంసక యోగం'.. ఈ రాశుల జీవితాల్లో గందరగోళం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి