Rahu Gochar 2023: మేషరాశిలో రాహు గోచారం.. ఈరాశులవారి ఇళ్లు డబ్బుతో నిండటం ఖాయం..
Rahu Gochar 2023: ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. అందులో రాహువు ఒకటి. రాహు సంచారం ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Rahu Gochar In Mesh 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం రాహువు వృషభరాశిలో కూర్చొని ఉన్నాడు. అతడు అక్టోబరులో తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఏడాది రాహువు సంచారం వల్ల కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
రాహు సంచారం ఈ రాశులకు శుభప్రదం
మిధునరాశి
మీ జాతకంలోని 11వ ఇంట్లో రాహువు సంచరించబోతున్నారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
మీ జాతకంలోని 10వ ఇంట్లో రాహువు సంచరించబోతున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాహువు సంచారం వల్ల కర్కాటకరాశి వారు ఆర్థికంగా లాభపడతారు. ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది.
వృశ్చిక రాశి
రాహువు ఈ రాశిచక్రం యొక్క జాతకంలో 6వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ రాహు సంచారం వల్ల మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మనోబలం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా పడుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
కుంభ రాశి
రాహు సంచారం వల్ల కుంభరాశి వారు శుభఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకున్నా లాభదాయకంగా ఉంటుంది. కెరీర్‌లో గొప్ప పురోగతి సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.
Also Read: Mercury Transit: మరో 5 రోజుల్లో ఈ రాశులకు బంపర్ లాటరీ.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook