Raj Yogam In Kundli: ఆస్ట్రాలజీలో గ్రహాల మార్పు మెుత్తం 12 రాశిచక్ర గుర్తులపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపిస్తాయి. మరో 5 రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఆగస్టు 17న సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి విడిచిపెట్టి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి (Sun Transit in Leo 2022) ప్రవేశిస్తుంది. ఇప్పటికే ఆ రాశిలో బుధుడు ఉన్నాడు. సింహరాశిలో సూర్య, బుధుడిల సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఆగస్టు 21 వరుకు ఉంటుంది. ఈ రాజయోగం వల్ల 3 రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చికం (Scorpio)- ఈ రాజయోగంతో వృశ్చిక రాశి వారు వృత్తి, వ్యాపారాలలో రాణిస్తారు. ఈ రాశి యెుక్క పదవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీనిని పని క్షేత్రం మరియు ఉద్యోగ స్థలం అని పిలుస్తారు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈ కాలంలో పచ్చని ధరించడం వల్ల మేలు జరుగుతుంది.


తుల (Libra) - ఈ రాశి వారి జాతకంలో 11వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ ఇంటిని ఆదాయం మరియు లాభాల స్థలంగా భావిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో ఆస్తి లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విదేశాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో మణి ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 


సింహ రాశి (Leo)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సింహ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భారీగా ధనాన్ని ఆర్జించే అవకాశం ఉంది. బుధాదిత్య యోగం ఈ రాశివారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. డబ్బు రాకకు అనేక కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Venus Transit August Effect: కర్కాటకంలో శుక్ర సంచారం... ఈ 3 రాశులవారికి జాక్ పాట్ ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook