COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rakhi 2024 lucky zodiac signs: హిందూ పురాణాల ప్రకారం రాఖీ పండుగను శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈరోజు అక్క చెల్లెల్లు అంతా కలిసి అన్నదమ్ముల దీర్ఘాయుష్షు పొందాలని కోరుతూ వారి మణికట్టుకు రాఖీ కడతారు. అన్నాదమ్ముల అక్కాచెల్లెల ప్రేమకు ప్రతీకగా నిలిచే ఈ పండగకు భారత్‌లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వచ్చే రాఖీ పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైన కొన్ని శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఈ పండగ ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


అయితే ఈ పౌర్ణమి రోజున ఎంతో ప్రాముఖ్యత కలిగిన సర్బార్థ సిద్ధి యోగం, ధనిష్ట నక్షత్రం, రవి యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశుల వారిపై సమానంగా పడబోతోంది. ముఖ్యంగా ఈ యోగాలు జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. రాఖీ పౌర్ణమి రోజున అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


రాఖీ పౌర్ణమి రోజు అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..
రాఖీ పండుగ రోజున ఆత్యధిక లాభాలు పొందబోయే రాశుల్లో కన్యా రాశి ఒకటి. ఈ రాశి వారికి తెలియపరంగా చాలావరకు పురోగతి లభిస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి సపోర్టు లభించి కార్యాలయాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే వీరికి సమాజంలో కీర్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా మానసిక ప్రశాంతత లభించి ఇంట్లో ఎంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ రాఖీ పండగ రోజున సోదరులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.


ధనస్సు రాశి: 
ధనస్సు రాశి వారికి రాఖీ పండుగ సందర్భంగా ఏర్పడి కొన్ని ప్రత్యేకమైన యోగాల కారణంగా మంచి జరుగుతుంది. వీరికి ఈ పండగ నుంచి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అలాగే వీరు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా కొన్ని వస్తువులపై అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.


మీన రాశి:
మీన రాశి వారికి రాఖీ పండుగ నుంచి అంతా శుభంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు రెట్టింపు లాభాలతో తిరిగి వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా మేలు చేస్తుంది. అలాగే వీరు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి పనులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.