Raksha Bandhan 2022: శ్రావణ మాసం ప్రారంభం కాగానే చాలా మంది ఎదురు చూసే పండుగ రక్షాబంధన్ (Raksha Bandhan 2022). సోదరిసోదరీమణుల ప్రేమకు ప్రతీక ఈ పండుగ. ఈ ఫెస్టివల్ ను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమి ఆగస్టు 11న జరుపుకోనున్నారు. పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10.38 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. అయితే రక్షాబంధన్ రోజున సోదరీమణులు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే..సోదరుడి జీవితంలో ఆనందం మరియు పురోగతి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్షాబంధన్ రోజున ఈ ప్రత్యేక చర్యలు చేయండి
>> జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రక్షాబంధన్ రోజున సోదరీమణులు తప్పనిసరిగా గణేశుడిని పూజించాలి. దీంతో పాటు వినాయకుడికి దుర్వా గడ్డి, చందనం, బేల్పత్రం మరియు రాఖీని సమర్పించండి. దీంతో సోదరుడి కోపం తగ్గుతుంది.


>> రక్షాబంధన్ రోజున సోదరీమణులు శివునికి జలాభిషేకం చేయాలి. అంతే కాకుండా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సోదరసోదరీమణుల మధ్య బంధం బలపడుతుంది. అంతేకాకుండా అన్ని కష్టాల నుండి బయటపడతారు.


>> రక్షాబంధన్ రోజున, సోదరీమణులు తమ సోదరుడికి వంటకాలు సిద్ధం చేసి తినిపించాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
>> అలాగే, రక్షాబంధన్ రోజున శుభ సమయంలో మీ సోదరుడికి రాఖీ కట్టండి. పొరపాటున కూడా భద్ర ముహూర్తంలో రాఖీని కట్టకండి.


Also Read: Venus Transit 2022: కర్కాటకంలో శుక్ర సంచారం...ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook