Raksha Bandhan 2022 Date: రక్షా బంధన్ 2022 ఒక పండుగ మాత్రమే కాదు... సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక. సోదరుడు దీర్ఘాయుష్షుతో ఉండాలని సోదరి రాఖీ కడితే... ఆమెను జీవితాంతం కాపాడతానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. ఈ రాఖీ పండుగను (Rakhi Festival) ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 11న జరుపుకోనున్నారు. అయితే రాఖీ పండుగ యెుక్క శుభముహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు ముళ్లే ఎందుకు?
రాఖీ కట్టేటప్పుడు సోదరుడినికి సోదరి మూడు ముడులు వేస్తుంది. సోదరుడు దీర్ఘాయువుతో ఉండాలని, వారి మధ్య బంధం చిరకాలం నిలిచిపోవాలని మూడు ముళ్లు వేస్తారు. అయితే హిందూ గ్రంథాల ప్రకారం, ఆ మూడు ముడులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు సంబంధించినవిగా నమ్ముతారు. 


రాఖీ కట్టే విధానం
రాఖీపౌర్ణమి రోజు అక్కలు, చెల్లెలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెడతారు. ''యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల" అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడి ఆశీర్వాదాలు తీసుకుంటారు. చివరిగా హారతి ఇచ్చి .. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు.


రాఖీ కట్టడానికి శుభ సమయం
శ్రావణ మాసం యొక్క శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 11 ఉదయం 10.38 నుండి ప్రారంభమై...ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 వరకు ఉంటుంది. రాఖీ కట్టడానికి అనుకూల సమయం ఆగస్టు 11న ఉదయం 9.28 గంటలకు ప్రారంభమై రాత్రి 9.14 గంటలకు కొనసాగుతుంది. ఈ శుభ సమయంలో సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టవచ్చు. ఈ రాఖీ పండుగ నాడు ఆయుష్మాన్ యోగం, రవి యోగం, సౌభాగ్య యోగం, శోభన్ యోగం అనే నాలుగు యోగాలు ఏర్పడుతున్నాయి. 


Also Read: Mangala Gowri vratham 2022: ఇవాళే శ్రావణ రెండో మంగళ గౌరీ వ్రతం, శుభముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.