Raksha Bandhan 2022: 200 ఏళ్ల తర్వాత రక్షాబంధన్ రోజున మహా సంయోగం.. ఈ టైంలో రాఖీ కట్టడం శుభప్రదం!
Raksha Bandhan 2022: ఈరోజు దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. అయితే దాదాపు 200 ఏళ్ల తర్వాత ఈ రక్షాబంధన్ రోజున ఓ అరుదైన మహా యాదృచ్ఛికం జరుగబోతుంది.
Raksha Bandhan 2022: దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇవాళే అంటే ఆగస్టు 11న రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. మన తెలుగు లోగిళ్లలో మాత్రం రాఖీ ఫెస్టివల్ ను ఆగస్టు 12న జరుపుకోనున్నారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ ఈ సారి చాలా ప్రత్యేకత సంతరించుకోనుంది. ఎందుకంటే ఈ రోజు దాదాపు 200 ఏళ్ల తర్వాత మహాసంయోగం (Mahasanyog) ఏర్పడుతుంది. ఇవాళే దేవగురు బృహస్పతి, గ్రహాల అధిపతి శని తిరోగమన స్థితిలో ఉంటారు. దీంతోపాటు ఆయుష్మాన్, సౌభాగ్య, ధ్వజ యోగం ఏర్పడనున్నాయి. దీంతో పాటు శంఖ్, హన్స్, సత్కీర్తి పేరుతో రాజయోగాలు కూడా రూపొందుతున్నాయి. దాదాపు 200 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుతమైన యాదృచ్ఛికం ఏర్పడుతుంది.
ఆగస్టు 11వ తేదీన పౌర్ణమి తిథి ఉదయం 10.39 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. ఆగస్టు11, పౌర్ణమి తిథి మరియు శ్రావణ నక్షత్రంతోపాటు గురువారం ఒక శుభ యోగం ఏర్పడబోతుంది. ఈ శుభ సమయంలో వాహనాలు, ఆస్తులు, ఆభరణాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ఇతర వస్తువుల కొనుగోలు చేయడం లాభిస్తుంది. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి, ఉద్యోగంలో చేరడానికి ఇదే మంచిరోజు. ఆస్ట్రాలజీ ప్రకారం, భద్ర కాలం గురువారం ఉదయం 10:39 గంటలకు ప్రారంభమై రాత్రి 8:52 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు.
శుభ సమయం
ఆగష్టు 11 - సాయంత్రం 5: 07 నుండి 6: 19
ఆగస్టు 11 - 8:52 నుండి 9:48 వరకు
ఆగష్టు 11- ప్రదోష కాలంలో 8:52 నుండి 9:15 వరకు
Also Read: Sun Transit Effect: సింహ రాశిలో సూర్య సంచారం.. ఈ రాశివారికి జాక్ పాట్ ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook