Aaj ka Rashifal 30 March 2023: శ్రీరాముడు చైత్ర శుక్ల తొమ్మిదవ రోజున జన్మించాడు. అందుకే దీనిని శ్రీరామ నవమి అని పిలుస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల నవరాత్రి వ్రతాన్ని కూడా ఈ రోజే  జరుపుకుంటారు. ఈసారి రామ నవమి నాడు కొన్ని ప్రత్యేక గ్రహాల కలయిక ఏర్పడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు సూర్యుడు, బుధుడు, గురుడు మీనరాశిలో ఉన్నారు. కాగా శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు. ఇది కాకుండా మేషరాశిలో శుక్రుడు, రాహువు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాలు ఈ శ్రీరామ నవమి నాడు మాళవ్య, కేదార్, హన్స్ మరియు మహాభాగ్య యోగాలను చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ పర్వదినాన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, గురు పుష్య యోగం మరియు రవి యోగం కూడా ఏర్పడుతున్నాయి. ఇన్ని యోగాల కారణంగా మూడు రాశులవారు ధనవంతులు కానున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


వృషభం: వృషభ రాశి వారికి రామ నవమి చాలా కలిసి వస్తుంది. మీరు అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 
తుల: ఈ శ్రీరామనవమి తులారాశి వారికి మంచి రోజులను తీసుకొస్తుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.
సింహ రాశి : రామనవమి కూడా సింహ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పాత అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. 


Also Read: Trigrahi Yog 2023: మేషరాశిలో త్రిగ్రాహి యోగం.. మార్చి 31 నుంచి ఈ మూడు రాశులకు కష్టాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి