Rama Ekadashi 2023: రామ ఏకాదశి పూజా విధానం, శుభ సమయాలు, పాటించాల్సిన నియమాలు..
Rama Ekadashi 2023: కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి రోజున వచ్చే రామ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల జీవితంలో సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Rama Ekadashi 2023: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి రోజున రామ ఏకాదశి ఉపవాసాలు పాటిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజు విష్ణువును పూజించడం వల్ల ఎన్నో జన్మల పాపాలు కూడా సులభంగా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం రామ ఏకాదశి నవంబర్ 9న (ఈ రోజు) వచ్చింది. అయితే ఈ రోజు శ్రీమహావిష్ణువును ఏయే సమయాల్లో పూజించడం శ్రేయస్కరమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రామ ఏకాదశి ఎప్పుడు?
ఏకాదశి తిథిల ప్రకారం రామ ఏకాదశి నవంబర్ 8 నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ తిథులు నవంబర్ 9 వరకు కొనసాగుతాయి. కాబట్టి శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు నవంబర్ 9 శుభసమయాల్లో చేయడం వల్ల స్వామి అనుగ్రహం లభిస్తుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
రామ ఏకాదశి శుభ సమయాలు:
ఏకాదశి తిథి నవంబర్ 8 ఉదయం 8:23 నుంచి ప్రారంభమవుతుంది.
ఏకాదశి తిథి నవంబర్ 9 ఉదయం 10:42లకు ముగుస్తుంది.
ఉపవాసాలు పాటించేవారు నవంబర్ 10 ఉదయం 06:40 నుంచి 08:50లోపు ప్రారంభించవచ్చు.
ప్రత్యేక పూజా సమయం నవంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి 9 వరకు..
రామ ఏకాదశి పూజ పద్ధతులు:
ఈ ఉపవాసాలు పాటించేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది.
ఉదయాన్నే తల స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న దేవుడి గుడిని శుభ్రం చేయాలి.
శ్రీ మహా విష్ణువు విగ్రహానికి జలాభిషేకం చేయాలి
ఆ తర్వాత పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామికి అభిషేకం చేయాలి.
విగ్రహానికి పసుపు చందనం, పసుపు పువ్వులతో అలంకరించాలి.
తర్వాత ఉపవాసాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చదువుతూ ప్రత్యేక పూజలు చేయాలి.
శ్రీ మహా విష్ణువు విగ్రహానికి హారతి సమర్పించి, నైవేద్యం సమర్పించాలి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook