Zakat or Islamic Income tax: జకాత్ లేదా ఇస్లామిక్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎవరికి చెల్లించాలి, ట్యాక్స్ పేయర్లు ఎవరు
Zakat or Islamic Income tax: రంజాన్ నెల ముస్లింల పవిత్రమైన నెల. ఉపవాసదీక్షలు ముగుస్తున్నాయి. ముస్లింలు తప్పకుండా చెల్లించే ఇన్‌కంట్యాక్స్ లేదా జకాత్ గురించి విన్నారా..ఆశ్చర్యంగా ఉందా..అదేదో తెలుసుకుందాం.
Zakat or Islamic Income tax: రంజాన్ నెల ముస్లింల పవిత్రమైన నెల. ఉపవాసదీక్షలు ముగుస్తున్నాయి. ముస్లింలు తప్పకుండా చెల్లించే ఇన్‌కంట్యాక్స్ లేదా జకాత్ గురించి విన్నారా..ఆశ్చర్యంగా ఉందా..అదేదో తెలుసుకుందాం.
ఇస్లామిక్ క్యాలెండర్ అనేది మొహర్రం నెలతో ప్రారంభమౌతుంది. రంజాన్ కూడా ఓ నెలపేరు. రంజాన్ తరువాత షవ్వాల్, జిల్ ఖిదా ఆ తరువాత జిల్ హిజ్జా నెలలు వస్తాయి. ఈ నెలలోనే బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్రిశ్రద్ధలతో జరుపుకునేవి ఈ రెండు పండుగలే. రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించడంతో..గౌరవ సూచకంగా నెలంతా ఉపవాసదీక్షలుంటారు.
అయితే ప్రతి దేశంలోనూ నిర్ధేశిత ఆదాయం కంటే ఎక్కువ సంపాదించేవాళ్లు ఆయా ప్రభుత్వాలకు చెల్లించేది ఇన్‌కంట్యాక్స్. అదే విధంగా ముస్లింలు తమ సంపాదనపై విధిగా ప్రతియేటా చెల్లించే ట్యాక్స్‌నే జకాత్ అంటారు. ఇది ప్రతి ముస్లిం తప్పకుండా ఆచరించాల్సిన విధి. మరి ముస్లింలు చెల్లించే ఈ జకాత్ లేదా ట్యాక్స్ ఎవరికి చెల్లిస్తారు. ప్రభుత్వానికా...కానేకాదు. ముస్లింలు తీసే ట్యాక్స్ పూర్తిగా పేదలకు చెల్లించాలి. ఇది పేదల హక్కు.
జకాత్ ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి
జకాత్ లేదా ఇస్లామిక్ ట్యాక్స్ అనేది ప్రతియేటా విధిగా రంజాన్ నెలలో తీయాల్సి ఉంటుంది. సంపాదన, ఆదాయం, బంగారం, వెండి వస్తువుల విలుపలో 2.5 శాతం విధిగా ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం తీసి..ఆ డబ్బును పేదలకు చెల్లించాలి. ముందుగా బంధువుల్లో పేదలుంటే వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవ ప్రాధాన్యతగా ఇతరులకు ఇవ్వవచ్చు. జకాత్ తీయగలిగిన అర్హులై ఉండి..జకాత్ తీయకపోతే ఇస్లాం మతం ప్రకారం మహా పాపం. రంజాన్ నెలలోనే తీయాలి. వాయిదా వేయకూడదు. ఇంట్లో ఉన్న బంగారం లేదా వెండి కొనుగోలు చేసినప్పటి ధర కాకుండా..ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం విలువ కట్టి..అందులో 2.5 శాతం తీయాలి.
జకాత్ ఎవరు తీయాలి
ఎవరి ఇంట్లో అయితే ఏడాది కాలంగా 80 గ్రాముల బంగారం లేదా 460 గ్రాముల వెండి ఏ రూపంలో ఉన్నా సరే..వారంతా ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం విలువ కట్టి అందులో 2.5 శాతం జకాత్ తీసి..పేదలకు, అనాధలకు, నిస్సహాయులకు లేదా రుణగ్రస్థులకు చెల్లించాలి. ఇది పూర్తిగా వారి హక్కు. జకాత్‌ను గోప్యంగా ఇవ్వాలి. ప్రచార ఆర్భాటాలుండకూడదు. అదే విధంగా 80 గ్రాముల బంగారం లేదా 460 గ్రామలు వెండి ఇప్పటి మార్కెట్ విలువ కంటే ఎక్కువ డబ్బు బ్యాంకులో లేదా ఇంట్లో ఏడాది కాలంగా ఉన్నా సరే..అంటే మీ నిత్యావసరాలు పోనూ..బ్యాలెన్స్ డబ్బు ఉంటే ఆ డబ్బుపై కూడా 2.5 శాతం జకాత్ విధిగా చెల్లించాలి.
జకాత్‌ను పూర్తిగా నగదు రూపంలోనే అర్హులైన పేదలు, అనాథలు, నిస్సహాయులు, రుణగ్రస్థులకు చెల్లించాలి. వస్తురూపంలో ఇవ్వకూడదు. మీరిచ్చే జకాత్ పూర్తిగా వారి హక్కేనని ఇస్లాం చెబుతోంది.
Also read: Eid ul fitr 2022: ఇండియా, సౌదీ అరేబియాలో ఈదుల్ ఫిత్ర్ ఎప్పుడు, చంద్రుడిని ఎప్పుడు చూడాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.