Lucky Zodiac Signs in January 2023: గ్రహాల సంచారం పరంగా జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో అంతరిక్షంలో అద్బుత మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మాసంలో మూడు రాజయోగాలు ఒకేసారి రూపొందబోతున్నాయి. ఇలా జరగడం సుమారు 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. న్యూఇయర్ తొలి రోజున సూర్యుడు, కుజుడు కలిసి ఆదిత్య మంగళ రాజయోగం, చంద్రుడు- బృహస్పతి సంయోగం వల్ల గజకేసరి రాజయోగం, ఆయుష్మాన్ యోగం ఏర్పడ్డాయి. ఈ మూడు రాజయోగాలు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. దీంతో కొత్త సంవత్సరంలో మూడు రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం: ఈ నెలలో వృషభరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ అదృష్టం తెరుచుకుంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కల నెరవేరుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీకు పూర్వీకుల స్థిర చరాస్తులు లభిస్తాయి. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. 
మకరం: జనవరిలో మూడు రాజయోగాలు మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు అప్పుల బాధ నుంచి బయటపడతారు. కొత్త సంవత్సరంలో మీ దారిద్ర్యం పోతుంది. 
మేషం: జనవరి నెల మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ నెలలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవికి లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళ్తారు. చాలా కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ మీకు లభిస్తుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 


Also Read: Jupiter transit 2024: 2024లో బృహస్పతి సంచారం.. ఈ 3 రాశులవారికి వరం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter