Rasi Phalalu: 2024వ సంవత్సరం అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ రాబోయే కొత్త సంవత్సరం గ్రహ సంచారాలకు ఇంతకు ముందున్న సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పెద్ద పెద్ద గ్రహాలు సంచారం చేయబోతున్నాయి అంతేకాకుండా కొన్ని గ్రహాలతో పాటు నక్షత్రాలు కూడా తిరోగమనస్థితిలో రాశులు మారబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఎంతో కీడు గ్రహంగా చెప్పుకునే రాహువు ఇదే సంవత్సరంలో రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం రాహు గ్రహం మీనరాశిలోనే సంచార దశలోనే ఉండబోతోంది. కాబట్టి దీని కారణంగా కొన్ని గ్రహాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాహు సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎఫెక్ట్ పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.



మేషరాశి:
2024 సంవత్సరంలో రాహు గ్రహం ఎఫెక్ట్ కారణంగా మేష రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మేష రాశి వారు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దూరం అవుతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో స్థిరపడ్డ వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా కష్టపడి పని చేసే వారికి పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే చిన్నచిన్న అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని పనులు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మిత్రులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


తులారాశి:
రాహు గ్రహం సంచారం చేయడం కారణంగా తులా రాశి వారికి రాబోయే 2024వ సంవత్సరం ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది అంతేకాకుండా వీరికి ఈ సంవత్సరం కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి దీనికి కారణంగా ఆస్తులపై పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు అనేక కొత్త పనులు నేర్చుకొని కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతారు. దీంతోపాటు చిన్న చిన్న సమస్యలన్నీ సులభంగా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.


కన్యా రాశి:
కన్యా రాశి వారికి రాహు గ్రహం సంచారం చేయడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కోరుకున్న కోరికలతో పాటు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు వ్యాపారంలో ఊహించని లాభాలు కూడా కలుగుతాయట. ఇక పెట్టుబడులు పెట్టే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇంట్లో ప్రశాంతత లభించడమే కాకుండా ఆనంద వాతావరణము నెలకొంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి