January Month Rasi Phalalu 2024: కొత్త సంవత్సరం అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మొదటి నెలలో జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యత కలిగిన అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ నెల చాలా ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశులకు చెందిన వ్యక్తులు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాబోయే 2024 సంవత్సరంలో జనవరి నెల ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
2024 సంవత్సరంలోని మొదటి నెలలో మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది. దీంతోపాటు ఉద్యోగాలు చేసేవారు జనవరి మొదటి నెలలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలు పొందుతారు. దీంతోపాటు ఈ సమయంలో చాలా రకాల ఆర్థిక లాభాలను పొందుతారు.


సింహరాశి:
సింహ రాశి వారికి జనవరి నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. దీంతోపాటు సింహ రాశి వారు ఈ నెలలో ఊహించని పురోగతిని పొందుతారు. అలాగే అదనపు ఆదాయ వనరులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని పనులు అసంపూర్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మంచి వ్యక్తులతో సంబంధాలు కూడా పెంచుకుంటారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే ఈ జనవరి నెల చాలా శుభ్రంగా ఉంటుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


కన్యారాశి:
కన్యా రాశి వారికి రాబోయే జనవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెద్ద ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. జనవరి సెకండ్ వీక్ లో కన్యా రాశి వారు ఊహించని లాభాలు కూడా పొందుతారు. శ్రేయోభిలాషులు స్నేహితుల నుంచి సహకారాలు పొందే అవకాశాలున్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు సీనియర్ల సపోర్టు లభించి మంచి లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి సంబంధంలో మాధుర్యం రెట్టింపు అవుతుంది. 


తులారాశి:
జనవరి నెల తులా రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా కొత్త పరిచయాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు నిలిచిపోయిన ఆస్తులకు భూములకు సంబంధించిన పనులు, వివాదాలు ఈ జనవరి నెలలో పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి. ఆర్థిక విషయాలపరంగా వీరు పెద్ద నిర్ణయాలను తీసుకుంటారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter