Rasi Phalalu today Horoscope December 25, 2021: on saturday know the condition of zodiac signs: రాశిఫలాలు డిసెంబర్ 25 2021: 
విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 21.
పుర్నిమంతా - 2078, పుష్యము 6
అమాంత - 2078, మార్గశిరము 21
తిథి
బహుళపక్షం షష్టి   - Dec 24 07:34 PM – Dec 25 08:09 PM
బహుళపక్షం సప్తమి   - Dec 25 08:09 PM – Dec 26 08:08 PM
నక్షత్రం
పూర్వ ఫల్గుణి - Dec 25 04:09 AM – Dec 26 05:05 AM
ఊత్తర ఫల్గుణి - Dec 26 05:05 AM – Dec 27 05:25 AM


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - 6:47 AM
సూర్యాస్తమానము - 5:44 PM
చంద్రోదయం - Dec 25 11:09 PM
చంద్రాస్తమయం - Dec 26 11:51 AM


అనుకూలమైన సమయం
రాహు - 9:31 AM – 10:53 AM
యమగండం - 1:38 PM – 3:00 PM


దుర్ముహూర్తం - 08:15 AM – 08:58 AM
వర్జ్యం - 12:23 PM – 02:01 PM


శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు - 11:54 AM – 12:38 PM
అమృతకాలము - 10:26 PM – 12:06 AM
బ్రహ్మ ముహూర్తం - 05:11 AM – 05:59 AM. ఇక ఈ రోజు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.


మేషం: (Aries)
శనివారం మేషరాశి వారికి చాలా మంచి రోజు. మీరు ఏ పని చేసినా కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయి. మీ కష్టానికి తగ్గట్లుగా ఫలితం పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.


వృషభం: (Taurus)
మీ రోజు మీకు అంతా మంచే జరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు. మీరు చేసే పనిలో ధనలాభం కలుగుతుంది. శనివారం అంతా నవ్వుతూనే గడుపుతారు. అయితే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మేలు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.


మిథునం: (Gemini)
ఈ శనివారం (saturday) కుటుంబంతో ఎక్కువ సేపు సమయాన్ని వెచ్చిస్తారు. పని చేసే ప్రాంతంలో మంచి ఫలితాలు పొందుతారు. డబ్బు లభిస్తుంది  కానీ ఆకస్మిక ఖర్చులు కూడా ఎదురుతాయి. చాకచక్యంతో పని చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. మీరు రూపొందించుకున్న ప్రణాళికల మేరకు మీ పనులన్నీ పూర్తి అవుతాయి.


కర్కాటకం: (Cancer)
ఈ రోజు అంతా శుభమే జరుగుతుంది. విద్యార్థులకు ఎంతో మంచి రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలను చూస్తారు. కుటుంబ అంతా సంతోషంగా ఉంటుంది. మీరు ఈ రోజు అంతా ఎంతో హాయిగా నవ్వుతూ గడుపుతారు.


సింహం : (Leo)
విద్యార్థులు వారి సామర్థ్యం, ​​తెలివితేటల ఆధారంగా విజయాలు సాధిస్తారు. కుటుంబంతో మంచి వాతావరణం నెలకొంటుంది. ఈ శనివారం మీకు ఎంతో ఉత్తమమైన రోజు. ఈ రోజు మీ మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 


కన్య: (Virgo)
ఈ శనివారం మీరు ఏ పని అయినా చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. పనిలో లాభదాయకమైన ఫలాలు చూస్తారు. మీ మానసిక స్థితి బాగుంటుంది.. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలు దొరుకుతుంది. వారితో ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది.


తుల: (Libra) 
శనివారం మీకు కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. మీరు ఇవాళ  కుటుంబంతో కొంత సమయం పాటు హాయిగా గడుపుతారు. వ్యాపారులు మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి డబ్బు చేతికొస్తుంది.


వృశ్చికం : (Scorpio)
శనివారం విద్య, పోటీ రంగాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. మీ పోటీదారుల కంటే ముందంజలో ఉంటారు. అదృష్టం వరిస్తుంది. మీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తారు.


ధనుస్సు: (Sagittarius) 
శనివారం ఒక శుభవార్తతో మీ రోజు ప్రారంభం కానుంది. పని చేసే ప్రాంతంలో ధనలాభం కలుగుతుంది. మీరు డబ్బును కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు.


మకరం: (Capricorn) 
ఈ శనివారం మీకు అంతా అదృష్టమే. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. దాంపత్య జీవితంలో మధురానుభూతి కలుగుతుంది.


Also Read :Blessings of jupiter : కొత్త ఏడాదిలో ఆ మూడు రాశులకు తిరుగులేదు.. బృహస్పతి అనుగ్రహంతో అంతా శుభమే!


కుంభం: (Aquarius) 
మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి కోసం మీరు మీ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వారు మీరు విజయం సాధించడానికి సహాయం చేస్తారు. మార్గనిర్దేశం చేస్తారు.


మీనం:  (Pisces) 
మీరు శనివారం పనిలో ఉత్సాహంగా ముందుకెళ్తారు. మంచి లాభాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి, పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది.


Also Read : RRRలోని 'కొమురం భీముడో..' పాట కాపీనా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook