Rasi Phalalu today Horoscope December 26, 2021: on sunday people of this zodiac will get good news: రాశిఫలాలు డిసెంబర్ 26 2021: విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 22
పుర్నిమంతా - 2078, పుష్యము 7
అమాంత - 2078, మార్గశిరము 22
తిథి
బహుళపక్షం సప్తమి - Dec 25 08:09 PM – Dec 26 08:08 PM
బహుళపక్షం అష్టమి - Dec 26 08:08 PM – Dec 27 07:28 PM
నక్షత్రం
ఊత్తర ఫల్గుణి - Dec 26 05:05 AM – Dec 27 05:25 AM
హస్త - Dec 27 05:25 AM – Dec 28 05:07 AM


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - 6:47 AM
సూర్యాస్తమానము - 5:45 PM
చంద్రోదయం - Dec 27 12:01 AM
చంద్రాస్తమయం - Dec 27 12:28 PM


అనుకూల సమయం
రాహు - 4:23 PM – 5:45 PM
యమగండం - 12:16 PM – 1:38 PM
దుర్ముహూర్తం - 04:17 PM – 05:01 PM
వర్జ్యం - 01:43 PM – 03:18 PM


శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు - 11:54 AM – 12:38 PM
అమృతకాలము - 10:07 PM – 11:45 PM
బ్రహ్మ ముహూర్తం - 05:11 AM – 05:59 AM. డిసెంబర్ 26 2021 నాటి రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి...


మేషం: (Aries)
మేష రాశి వారు ఆదివారం ఎంతో సంతోషకరంగా ఉంటారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీతో కొందరు ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తారు. మీ చుట్టు పక్కన ఉన్న వారంతా ఈ రోజు మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.


వృషభం: (Taurus)
మీరు మీ మృదువైన మాటల ద్వారా కొందరికి చాలా దగ్గరవుతారు. వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ ఆదివారం చాలా మంచి రోజు.


మిథునం: (Gemini)
వైవాహిక వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు ఎంతో సరదాగా గడుపుతారు. మీ నచ్చిన వ్యక్తుల ఎదుట వారిపై మీకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇది సరైన రోజు.


కర్కాటకం: (Cancer)
కుటుంబ సభ్యులతో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. కొన్ని విషయాల్లో మీరు చాలా సున్నితంగా ప్రవర్తించాల్సి వస్తుంది. మీ మానసిక స్థితి స్థిరంగా ఉండదు. ఏదైనా పని చేసే ముందు కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి.


సింహం : (Leo)
మీరు పాత బాధలను పూర్తిగా మరిచిపోయేందుకు మార్గాలు లభిస్తాయి. ఈ రోజు కొత్త స్నేహితులు మీ జీవితంలోకి వస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వేడుకలు, పార్టీల వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. మీ బంధువుల్లో ఒకరు మీకు అండగా నిలుస్తారు. ఈ రోజు మీరు అనుకున్నదంతా జరుగుతుంది.


కన్య: (Virgo)
కన్యా రాశి వారు ఈ ఆదివారం కాస్త వాగ్వాదాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. మీకు బాగా నచ్చిన వ్యక్తులతోనే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. గొడవలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మీరు మౌనంగా ఉండడం మేలు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసేందుకు ఇది మంచి సమయం.


తుల: (Libra) 
ఈరోజు మీ దాంపత్య జీవితంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మిమ్మల్ని అభిమానించే వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామి మద్దతు పొందుతారు. ఆప్యాయత లభిస్తుంది. కానీ ఒక విషయంలో మాత్రం మీ మనసు కాస్త కలత చెందుతుంది.


వృశ్చికం : (Scorpio)
కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాస్త ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ప్రాణ స్నేహితులతో గొడవలు ఏర్పడి.. విడిపోయే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా ఎదుటి వ్యక్తులతో వాదించకండి.


ధనుస్సు: (Sagittarius) 
ధనుస్సు రాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందులు ఎదురు అవుతాయి. స్నేహితులు, బంధువులు కొన్ని విషయాల్లో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాలలో అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా మసలుకోండి.


మకరం: (Capricorn) 
మీరు ఎవరికైనా లవ్‌ ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసుకుని ఉంటే.. ఇదే సరైన సమయం. ఇక పెళ్లయిన వారు ఈ ఆదివారం తమ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. కాస్త ఒత్తిళ్లు వస్తుంటాయి. అయితే స్నేహితులతో కలిసి వారితో మాట్లాడడం వల్ల మీ ఒత్తిళ్లు కూడా తగ్గిపోతాయి.


Also Read : Singer Revanth: గ్రాండ్‌గా సింగర్ రేవంత్‌ నిశ్చితార్థం, ఫోటోలు వైరల్‌


కుంభం: (Aquarius) 
మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మలుపు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆసక్తులను, ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మీ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది.


మీనం: (Pisces) 
లవ్, రిలేషన్‌షిప్‌ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ బంధంలో ఏవైనా విభేదాలు తలెత్తినా సులభంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. మీ కుటుంబంలో ఏదైనా ఒక శుభ కార్యాన్ని నిర్వహించే అవకాశం ఉంది. మీన రాశి వారు ఈ ఆదివారం కొన్ని శుభవార్తలు వింటారు. 


Also Read : Plants grow at home: ఇంట్లో ఈ మొక్కలు నాటి పూజిస్తే.. డబ్బు, సుఖసంతోషాలు మీ సొంతం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి