Sri Rama Mantras:  శ్రీరాముడు మానవరూపం ఎత్తిన దేవుడు. ఆయనను భక్తితో కొలిస్తే కోరినవన్నీ ఇస్తాడు. అందుకే సాధారణంగా శ్రీరాముని పూజించే వారికి ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, శ్రీ రాముని మంత్రాలను పఠిస్తే మీకు సంపద శ్రేయస్సుతో పాటు ఆరోగ్యం కూడా ప్రసాదిస్తాడు. ఎందుకంటే శ్రీరాముడు ఎప్పుడూ తనను భక్తితో వేడుకున్నవారిని ఎప్పుడూ ఒంటరిగా వదలేయడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీరామ మంత్రాలు..
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్యే
రఘునాథాయ నాదాయ సీతాయ పథాయే నమః


ఈ మంత్రాన్ని పఠించిన వారి కోరిన కోర్కెలు తీరుస్తాడు శ్రీరాము. అంతేకాదు ఈ మంత్రాన్ని పఠించిన వారి మనస్సు కూడా ఎల్లప్పుడూ శాంతియుతంగా ఉంటుంది. వారికి శ్రీరాముడు జీవితంలో సరైన మార్గాన్ని చూపిస్తాడు అని నమ్ముతారు.


ఓం దశరథయే విద్మహే సీతావల్లభయ ధేమహి, తనో రామ ప్రచోదయత్
శ్రీరామునికి ఎంతో ఆరాధ్యమైన ఈ రామ గాయత్రి మంత్రం సీతాదేవికి అంకితం చేశారు. ఈ మంత్రాన్ని పఠిస్తే మీ మెదడు సక్రమంగా పనిచేస్తుంది. మంచి ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది.


ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహ- ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శ్రీరాముని సుగుణాలు వారిలో చూడవచ్చు


ఇదీ చదవండి: తమలపాకును దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?


శ్రీ రామ జయ రామ కోదండ రామ..
ఈ శ్రీరాముని మంత్రాన్ని పఠించడం వల్ల మీలో ఉన్న ఆందోళన భావం తొలగిపోతుంది. అంతేకాదు ఇది విజయాన్ని కూడా సూచిస్తుంది.


శ్రీరామ శరణం మామ..
ఈ శ్రీరామ మంత్రాన్ని పఠించిన వారికి మానసిక, శారీరక స్థైర్యం లభిస్తుంది.


శ్రీరామ చంద్రాయ నమః..
ఈ శక్తివంతమైన శ్రీరామ మంత్రం శ్రీరాముని, చంద్రునికి వర్తిస్తుంది. ఇది మనకు మానసిక చింతనల నుంచి బయటపడేస్తుంది. అందుకే తప్పనిసరిగా ప్రతిఒక్క శ్రీరామ భక్తుడు ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించాలి.


ఇదీ చదవండి: భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినకూడదా? కారణం ఏంటో తెలుసా?


హీన రామ్ హీన రామ్..
ఇది కూడా శ్రీరాముని శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం పఠించినవారికి ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. 


రామాయ నమః..
ఈ మంత్రం స్వచ్చతకు నిదర్శనం. ఇది పఠించినవారిలో ఏకాగ్రత్త పెరుగుతుంది. మనస్సులో నుంచి చెడు ఆలోచనలను తొలగిస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook