Shani Uday in Kumbh Rashi 2024: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. వీటి ప్రభావం కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. రీసెంట్ గా శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. ఇతడు మళ్లీ మార్చి 18న అదే రాశిలో ఉదయించబోతున్నాడు. పురాణాల ప్రకారం, శనిదేవుడిని కర్మఫలదాత అంటారు. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం సర్వనాశనమవుతుంది. కుంభరాశిలో శనిదేవుడు ఉదయించడం వల్ల ఏ రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
కుంభరాశిలో శనిదేవుడు సంచారం మకర రాశి వారికి పెద్ద మెుత్తంలో డబ్బును ఇవ్వబోతుంది. ఇతరులతో మీ సంబంధాలు పెరుగుతాయి. మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు ఆస్తులు కొనుగోలు చేస్తారు 
కుంభ రాశి
మార్చి 18న శనిగ్రహం ఇదే రాశిలో లగ్న గృహంలో ఉదయించబోతోంది. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీ జాతకంలో శష మహాపురుష యోగం ఏర్పడి.. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీపై విశ్వాసం పెరుగుతుంది. మెుత్తానికి మీకు మంచి రోజులు రాబోతున్నాయన్న మాట.
వృషభం
శనిదేవుడి పెరుగుదల వల్ల మీరు వృత్తి మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు పెద్ద మెుత్తంలో లాభాలను ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. మీరు ఉన్నత పదవులు అధిరోహిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Mercury Transit 2024: శనిదేవుడి రాశిలోకి బుధుడు.. రేపటి నుండి ఈ రాశుల సుడి తిరగబోతుంది..


Also Read: Shukra Gochar 2024: రాశిని మార్చనున్న శుక్రుడు.. ఈ 3 రాశులవారు కోటీశ్వరులవ్వడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook