Rudraksh Benifits: హిందూ పురాణాల ప్రకారం.. రుద్రాక్ష శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించింది. రుద్ర, అక్షల కలయికే రుద్రాక్ష అని చెబుతారు. ఆ పరమేశ్వరుడి స్వరూపంగా దాన్ని భావిస్తారు. ఆధ్యాత్మికంగా రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివ మహా పురాణంలో 16 రకాల రుద్రాక్షల గురించి పేర్కొన్నారు. వాటిల్లో ఒకటైన ఏకముఖి రుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నకిలీ రుద్రాక్షను ఎలా గుర్తించాలి :
 


ఆవ నూనెలో ఏకముఖి రుద్రాక్ష ఒకటి వేసి చూడండి. అది మొదట ఉన్న రంగు కంటే ముదురు రంగులోకి మారితే నిజమైన రుద్రాక్ష అని అర్థం. ఏకముఖి రుద్రాక్షను గుర్తించడానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. ఏకముఖి రుద్రాక్షకు ఒకే గీత ఉంటుంది. రుద్రాక్షను వేడి నీటిలో ఉడకబెట్టి చూడండి. అది రంగు కోల్పోతే నకిలీది అని అర్థం. 


ఇలా కూడా గుర్తించవచ్చు :


ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల నకిలీ రుద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. నకిలీ రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందలేరు. ఏకముఖి రుద్రాక్ష నకిలీదా అసలుదా గుర్తించేందుకు దాని ఆకారాన్ని గమనించండి. ఒరిజినల్ రుద్రాక్ష అయితే దాని ఆకారం జీడిపప్పులా లేదా అర్ధ చంద్ర ఆకారంలో ఉంటుంది.  


రుద్రాక్షను ఎవరు ధరించాలి :


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏకముఖి రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. సూర్యునితో సంబంధం కారణంగా ఏకముఖి రుద్రాక్ష సింహ రాశి ప్రజలకు ప్రత్యేకంగా ఫలవంతమైనదని చెప్పొచ్చు. ఇతర రాశుల వారు జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించాలి.


ఏకముఖి రుద్రాక్షను ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఏకముఖి రుద్రాక్షను ధరించడం మంచిది. ఇది సూర్య దోషాన్ని తొలగిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయేలా చేస్తుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తుందని నమ్ముతారు.


ఏకముఖి రుద్రాక్ష ప్రభావంతో, ఒక వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించుకోగలుగుతాడు. అంతేకాదు, ఆ వ్యక్తి ఆర్థిక పురోగతికి అది దోహదపడుతుంది. అదే సమయంలో ఇది విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కెరీర్‌ పరమైన లక్ష్యాలను చేరుకునేందుకు ఏకముఖి రుద్రాక్షను ధరించడం మంచిదని పండితులు చెబుతారు.


Also Read: Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయం!


Also Read: SVP Pre-Release Event: మహేష్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.