COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sankashti Chaturthi Jan 2024: హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈరోజు సోమవారంతో పాటు సంక‌ష్టి చ‌తుర్థి రావడం వల్ల శుభ యాదృచ్ఛికమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణ పక్ష చతుర్థి రోజున 2024 సంవత్సరం మొదటి సంక‌ష్టి చ‌తుర్థిని జరుపుకుంటారు. ఈ రోజు హిందువులు పండగా జరుపుకుంటారు. శాస్త్రం ప్రకారం గణేశుడితో పాటు చంద్రుడు పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా పిల్లలు దీర్ఘాయువుతో ఉంటారని భక్తుల నమ్మకం.. 


ఈ రోజు రాత్రి శుభ సమయాల్లో గణేషుడిని పూజించడమే కాకుండా చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. అయితే ఇలా పూజలు చేసేవారు తప్పకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అర్ఘ్యం సమర్పించేవారు తప్పకుండా ఉపపవాసాలు పాటించాలి. అంతేకాకుండా చంద్రుడికి  అర్ఘ్యం సమర్పించేవారు కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే ఈ శుభకార్యాన్ని చేయాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే సమయాల్లో చేయడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.


సంక‌ష్టి చ‌తుర్థి రోజు ఇవి తప్పకుండా చేయాల్సి ఉంటుంది:
సంక‌ష్టి చ‌తుర్థి వ్రతం రోజు తప్పకుండా వినాయకుడిని పూజించిన తర్వాత రాత్రి శుభ సమయాల్లో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉపవాసాలు కూడా పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే క్రమంలో పాదాలపై ఆ నీరు చల్లకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


హిందూ సంప్రదాయం ఈ సమయంలో నల్లని దుస్తులు ధరించకపోవడం శుభప్రదమని శాస్త్ర నిపుణులు తెలిపారు. కాబట్టి ఈ సుభ సమయంలో నలుపు రంగుతో కూడిన దుస్తులను ధరించడం మానుకోవాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించవచ్చు. ఈ సంక‌ష్టి చ‌తుర్థి రోజు గణపతి పూజలో భాగంగా తులసి ఆకులు, ఎరుపు రంగు పుష్పాలను వినియోగించకపోవడం మంచిది. అయితే ఈ సమయంలో గరకపోసలు, కుడుములు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter