Sankranti 2024 Date: మకర సంక్రాంతి పండగ ఎప్పుడు? పగలు, రాత్రి సమయాల్లో ఎందుకు మార్పులు వస్తాయి?
Sankranti 2024 Date: సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల ప్రతి సంవత్సరం మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం సూర్యుడు ఏ రోజు సంచారం చేస్తుందో, సంక్రాంతి తేది, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
When Is Makar Sankranti 2024: ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం..సూర్యగ్రహం తన కక్ష్యను దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మార్చుకుంటూ మకరరాశిలోకి సంచారం చేయబోతోంది. సూర్యుడు తన కక్ష్యను మార్చుకునే రాశిని సంక్రాంతి అంటారు. ఈ కక్ష్యలో మార్పులు రావడం వల్ల పగటి సమయం పెరిగి, రాత్రి వ్యవధి తగ్గుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగను శతభిషా నక్షత్రంలో వ్యతిపాత యోగం శుక్ల పక్ష చతుర్థి తిథిలో సోమవారం వచ్చింది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..ఉత్తరాయణ కాలాన్ని దేవతల పగలని, దక్షిణాయనాన్ని దేవతల రాత్రిగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది రాబోయే సంక్రాంతి పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గత ఏడాది కంటే ఈ సంవత్సరం వచ్చే పండగ సమయంలో తిథుల్లో మార్పులు రావడం వల్ల..పండగను ఏయే సమయాల్లో జరుపుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.
మకర సంక్రాంతి తేది:
ఈ ఏడాది కూడా జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోవడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకుముందు 2022, 2023లో కూడా మకర సంక్రాంతిని జనవరి 15న వచ్చింది. మిథిలా పంచాంగం ప్రకారం..సూర్యుడు జనవరి 15 ఉదయం 8:30 గంటలకు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి సంచారం చేస్తాడు. కాశీ పంచాంగం ప్రకారం.. ఉదయం 8:42 గంటలకు సంచారం జరుగుతుంది. కాబట్టి జనవరి 15న పండగను జరుపుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
మకర సంక్రాంతి రోజు ఇలా చేయడం చాలా శుభప్రదం:
మకర సంక్రాంతి రోజున గంగాస్నానం ఆచరించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు నలుగు పేదలకు దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. దీంతో పాటు పూర్వ జన్మలలో తెలిసి, తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేసి దుప్పట్లు, నెయ్యి, నువ్వులు, లడ్డూలు, వస్త్రాలు దానం చేయడం ఊహించని లాభాలు కలుగతాయి. దీంతో పాటు మనసిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter