Santan Saptami 2022 Date: చాలా మంది దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉంటారు. హిందూమతంలో పిల్లలను కలగడానికి ఓ వ్రతం ఉంది. అదే సంతాన సప్తమి వ్రతం. ఈ రోజున (Santana Saptami Vratam 2022) దంపతులు పిల్లలు పుట్టాలని పార్వతీపరమేశ్వరులను పూజిస్తే.. తప్పక వారి కోరిక నెరవేరుతుంది. అయితే ఈ ఏడాది సంతాన సప్తమి వ్రతం తేదీ, శుభ సమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంతాన సప్తమి 2022 తేదీ
భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఏడవ రోజున సంతాన సప్తమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈసారి సప్తమి తిథి 2 సెప్టెంబర్ 2022న మధ్యాహ్నం 1:51 గంటలకు ప్రారంభమై... 3 సెప్టెంబర్ 2022 మధ్యాహ్నం 12.28 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, సంతాన సప్తమి వ్రతాన్ని సెప్టెంబర్ 3న జరుపుకుంటారు. 


శుభ ముహూర్తం
సంతాన సప్తమి వ్రతాన్ని సెప్టెంబర్ 3న పాటిస్తారు. ఈ రోజు ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు ఆరాధనకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీరు ఉదయం పూజ చేయాలనుకుంటే, ఉదయం 7.35 నుండి 9.10 గంటల వరకు ముహూర్తం చాలా శుభప్రదం.


వ్రత ప్రాముఖ్యత
సంతానం పొందడానికి, పిల్లల ఆరోగ్యం బాగుండాలని సంతాన సప్తమి వ్రతాన్ని పాటిస్తారు. అంతేకాకుండా మహిళలు తమ పిల్లల ఆనందం, శ్రేయస్సు మరియు సంతోషకరమైన జీవితం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారుఈ రోజున శివుడు మరియు తల్లి పార్వతిని పూజిస్తారు.


Also Read: కన్యారాశిలో లక్ష్మీ నారాయణ యోగం... అంతులేని సంపద ఈ రాశుల సొంతం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook