Sarva Pitru Amavasya 2022 today: ఇవాళే సర్వపితృ అమావాస్య. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ఈ రోజు శ్రాద్ధం చేస్తారు. అదే విధంగా దేవీ నవరాత్రులు రేపటి నుండి ప్రారంభంకానున్నాయి.  దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకల కోసం దుర్గాదేవి (Goddess Durga Devi) ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే విజయవాడలోని దుర్గామాత గుడి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా చాలా మంది భవానీ మాలలు వేయలేదు. ఈ ఏడాది భారీగా భక్తులు మాలలు ధరించారు. ఈ నేపథ్యంలో బెజవాడ కనకదుర్గ ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రుల్లో దుర్గాదేవి యెుక్క 9 రూపాలను పూజిస్తారు. దసరాతో నవరాత్రులు ముగుస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ పవిత్ర 9 రోజులు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. దుర్గాదేవి ఆశీస్సులతో వీరు వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.


నవరాత్రులు ఈ రాశులవారికి శుభప్రదం
వృషభం (Taurus)- ఈ రాశి వారికి  నవరాత్రులు శుభప్రదంగా ఉంటాయి. ఈ సమయంలో వీరు  శుభవార్తను వింటారు. ఈ రాశి వారు కెరీర్ లో పురోగతి సాధించడంతోపాటు అపారమైన సంపదను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు సాధిస్తారు.  
వృశ్చిక రాశి (Scorpio)- ఈ 9 రోజులు వృశ్చిక రాశి వారికి చాలా పురోభివృద్ధిని, ధనం మరియు సంతోషాన్ని ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 
కుంభం (Aquarius)- కుంభ రాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో సంతోషంగా గడుపుతారు. పెట్టుబడికి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. 
ధనుస్సు రాశి (Sagittarius)- నవరాత్రి 9 రోజులు ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు పురోగతిని సాధిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఒత్తిడి దూరమవుతుంది.  


Also Read: Shani Dev Margi October 2022: మార్గంలోకి శనిదేవుడు.. మరికొన్ని రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook