Sarva Pitru Amavasya 2022 Date and Time: పితృ పక్షం రేపటితో ముగియనుంది. పితృ పక్షం చివరి రోజునే సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య లేదా అశ్వినీ అమావాస్య అని అంటారు. పితృ పక్షం 15 రోజుల్లో మీరు మీ పూర్వీకులకు ఏ కారణం చేతనైనా శ్రాద్ధం చేయలేకపోతే, సర్వపితృ అమావాస్య నాడు దానిని చేయండి. ఇలా చేయడం మీ పూర్వీకుల సంతోషించి మిమ్మిల్ని ఆశీర్విదించి భూమి నుండి తిరిగి వెళ్లిపోతారు. సర్వపితృ అమావాస్య (Sarva Pitru Amavasya 2022) ఎప్పుడు, పూర్వీకులకు తర్పణం ఎలా చేయాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్వపితృ అమావాస్య తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, పితృ పక్షం యొక్క అమావాస్య తిథి సెప్టెంబర్ 25 న తెల్లవారుజామున 3:12 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 26 తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం సెప్టెంబర్ 25న శ్రాద్ధం జరుపుకోవచ్చు.  


సర్వపితృ అమావాస్య ప్రాముఖ్యత
సర్వపితృ అమావాస్యను హిందూ గ్రంధాలలో పితృ విసర్జని అమావాస్య అని కూడా అంటారు. మీ పూర్వీకులు మరణించిన తేదీ మీకు తెలియకపోతే లేదా ఏదైనా కారణం వల్ల ఆ తేదీన శ్రాద్ధం చేయలేకపోతే, మీరు సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. సర్వపిత్రి అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని, వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. 


Also Read: Shani Remedies: శని వక్ర దృష్టి, మహాదశ, సాడే సతి నుండి బయటపడటానికి.. శనివారం ఇలా చేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook