Saturday Astro Remedies: శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శని దేవుడిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ శనివారం ఆషాఢ మాసంలో కృష్ణ పక్షం పంచమి తిథిన ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాటు కొన్ని నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. వ్యాపారంలో వృద్ధితో పాటు కష్టాల నుంచి బయటపడొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా చేస్తే సమస్యలన్నీ దూరమై సంపద పెరుగుతుంది :


మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందాలనుకుంటే... శనివారం మంగళ మంత్రాన్ని జపించండి.'ఓం క్రాన్ క్రీన్ క్రౌన్స్: భౌమయ్ నమః' అని పఠించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.


కెరీర్‌లో సమస్యలు తొలగిపోవాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి జమ్మిచెట్టు ఆకులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి.


కుటుంబ సంబంధాలలో ప్రేమ, ఆత్మీయతలు పెంపొందేందుకు.. శనివారం హనుమంతుడికి తేనెను నైవేద్యంగా సమర్పించండి. అలాగే, 'ఓం హున్ హనుమంతే నమః' మంత్రాన్ని 11 సార్లు జపించండి.


శుభ ఫలితాలను పొందడానికి శనివారం జమ్మి చెట్టును పూజించండి. జమ్మిచెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి చెట్టు వద్ద దీపం వెలిగించాలి.


పిల్లలకు శుభం జరిగేందుకు శనివారం ఉదయం వారిని శివాలయానికి తీసుకెళ్లండి. శివుడికి పాలాభిషేకం చేయండి.


మీ సంపద పెరగాలంటే.. శనివారం శివాలయంలో ఒకటిన్నర కిలోల బియ్యాన్ని శివుడికి సమర్పించాలి.


శని దేవుడు న్యాయ దేవత. కర్మానుసారం ఆయా వ్యక్తులకు తగిన ఫలితాలు అందిస్తాడు. అయితే శని అనుగ్రహం పొందడం ద్వారా ఎటువంటివారికైనా చెడు ప్రభావాలన్నీ తొలగి శుభం జరుగుతుంది.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Horoscope Today June 18th : నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ఉద్యోగంలో బదిలీ తప్పకపోవచ్చు..


Also Read: Agnipath Riots:వరంగల్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook