Vish Yoga Impact:  జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లినప్పుడు అనేక రకాల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. శని మరియు చంద్రుని కలయిక కారణంగా ఇలాంటి యోగమే ఒకటి ఏర్పడుతుంది. శనిదేవుడు మకరరాశిని విడిచిపెట్టి.. జనవరి 17, 2023న సాయంత్రం 05:04 గంటలకు తన సొంత రాశిలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశించాడు. మరోవైపు మనసుకు కారకుడైన చంద్రుడు ఒక్కో రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు. చంద్రుడు-శని కలయిక ఫలితంగా జనవరి 23, 2023న కుంభరాశిలో కుంభరాశిలో విష యోగం ఏర్పడింది. విష యోగం వల్ల ఏ రాశుల వారు ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి 
కర్కాటక రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారు అనేక కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈరాశి వ్యక్తులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనిని ప్రారంభించవద్దు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. వీలైనంత వరకు వాటిని నివారించడానికి ప్రయత్నించండి. శని గ్రహం ప్రభావం వల్ల మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో శివుడిని మరియు శని దేవుడిని పూజించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
కన్యారాశి
కన్యా రాశి వారికి విష యోగం అననుకూలంగా ఉంటుంది. ఇది మీ జాతకంలోని ఆరవ ఇంట్లో ఏర్పడుతోంది. దీని కారణంగా మీరు కోర్టు కేసుల్లో అపజయాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రయాణాలకు దూరంగా ఉండండి. వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. 
మీనరాశి
మీన రాశి వారికి విషయోగం ఇబ్బందులను కలిగిస్తుంది.  మీ జాతకంలో పన్నెండవ ఇంట్లో శని మరియు చంద్రుడు కలిసి ఉన్నారు. దీని కారణంగా మీ ఖర్చులు పెరగవచ్చు. తద్వారా మీరు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి రావచ్చు. ఈసమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి.  ఏ విషయంలోనూ నిర్లక్ష్యం వహించవద్దు. 


Also Read: Guru Uday 2023: మీనంలో ఉదయించనున్న గురుడు.. ఈ రాశులపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook