Saturn Venus Conjunction 2023: శని, శుక్ర గ్రహాల యుతి, మరో మూడు వారాలు ఈ రాశులకు రోజూ కనకవర్షమే
Saturn Venus Conjunction 2023: శని గ్రహం తన మూల త్రికోణమైన కుంభరాశిలో గోచారమైంది. జనవరి 22వ తేదీన శుక్ర గోచారం కూడా జరగడంతో కుంభరాశిలో శని-శుక్ర గ్రహాల యుతి ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశులకు రోజూ కనకవర్షమే అంటున్నారు జ్యోతిష్య పండితులు
కుంభరాశిలో శని, శుక్ర గ్రహాల యుతి కారణంగా ఇవాళ్టి నుంచి కొన్ని రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. శని, శుక్ర గ్రహాల యుతి కారణంగా అత్యంత లాభదాయకం కానుంది. మరో మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆ వివరాలు మీ కోసం..
వాస్తవానికి కుంభరాశిలో జనవరి 17వ తేదీన శని ప్రవేశం జరిగింది. ఆ తరువాత జనవరి 22వ తేదీన శుక్ర గ్రహం పరివర్తనం కుంభరాశిలో పూర్తయింది. ఓ వైపు న్యాయ దేవత శని రాశి కుంభంలో శుక్రుడి యుతి అత్యంత మహత్యం కలిగిందిగా మారింది. దీని ప్రభావం వాస్తవానికి 12 రాశులపై కూడా పడుతోంది. కానీ కొన్ని రాశులకు మాత్రం అదృష్టం వెంటాడుతుంది. ఈ జాతకులకు కేవలం ధనలాభం ఒక్కటే కాదు..కెరీర్‌పరంగా విజయం లభిస్తుంది. దాంతోపాటు ప్రేమ జీవితం, వైవాహిక జీవితం రెండూ ఆనందంగా ఉంటాయి.
శని, శుక్ర గ్రహాల యుతి ప్రభావం
వృషభ రాశి
శుక్ర, శని గ్రహాల యుతి వృషభ రాశి జాతకులకు అత్యంత శుభసూచకం కానుంది. ఈ జాతకం వారికి కెరీర్, వ్యాపారంలో ఇప్పటివరకూ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భారీ విజయం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటు ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది.
కన్యారాశి
శని, శుక్ర గ్రహాయ యుతి కన్యారాశి జాతకులకు భారీ లాభాలు ఆర్జిస్తుంది. ప్రతి పనిలో అదృష్టం తోడుగా ఉంటుంది. అన్ని పనులు పూర్తవుతాయి. యాత్రలకు వెళ్లే అవకాశముంది. ధనలాభం తప్పకుండా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.
తులా రాశి
తులారాశి జాతకులకు శని గోచారం, శుక్ర గోచారం కారణంగా ఏర్పడిన యుతి అత్యంత లాభదాయకం కానుంది. ఒత్తిడి దూరమౌతుంది. ఆరోగ్య సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మంచి ఫిట్నెస్‌తో ఉంటారు. ధనలాభముంటుంది.
మకర రాశి
శని, శుక్ర గ్రహాల యుతి మకర రాశి జాతకులపై చాలా శుభసూచకంగా ఉంటుంది. ఈ జాతకం వారికి ధనలాభం ప్రాప్తిస్తుంది. చాలాకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు దూరమౌతాయి. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. కుటుంబంలో మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తాయి.
Also read: Saturn Moon Conjunction 2023: అరుదైన విష యోగం.. ఈ రాశుల వారి పని ఔట్! రాబోయే 3 రోజులు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook