Shani Margi 2023: త్వరలో కుంభరాశిలో నేరుగా నడవనున్న శని.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Margi Shani 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. త్వరలో శని నేరుగా నడవనున్నాడు. శనిదేవుడి సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Margi 2023 effect: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలేది శని. ఇతడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు వరకు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం శని నేరుగా నడవటం మెుదలపెట్టనున్నాడు. శని గ్రహం ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
శని మార్గి ఈ 3 రాశులకు వరం
వృషభం
వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి. శనిదేవుడు మీ రాశి నుండి 10వ ఇంట్లో మార్పు చెందబోతున్నాడు. మీరు వృత్తి మరియు వ్యాపారాల్లో వృద్ధి చెందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహరాశి
శని మార్గి సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుడు మీ రాశి నుండి ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. దీని కారణంగా శష్ రాజయోగం ఏర్పడనుంది. వ్యాపారం చేసేవారు మంచి లాభాలు పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. మీరో కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
మకరరాశి
నవంబర్ నెలలో శనిదేవుడు మీ డబ్బు ఇంట్లో సంచరించనున్నాడు. మకర రాశి వారికి శని మార్గం చాలా మేలు చేస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
Also Read: Sawan Shivratri 2023: శ్రావణ శివరాత్రి ఈ 4 రాశుల వారికి ప్రత్యేకం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook