Saturn Transit 2022 in Aquarius: శని గ్రహం రెండున్నరేళ్లలో రాశిచక్రాన్ని మారుస్తుంది. ఏప్రిల్ 29 న, శని మకరరాశిని విడిచిపెట్టి.. తన స్వంత రాశిచక్రం కుంభరాశిలోకి (Saturn Transit in Aquarius 2022) ప్రవేశించబోతోంది. 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని. దీని మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ఆ రాశులేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం(Aries): శని సంచారం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. లాభ, ఆదాయ స్థానమైన ఈ రాశికి 11వ ఇంట్లో శని సంచరిస్తాడు. శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తుల జీతంలో పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. కెరీర్‌లో కూడా పురోగతి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు చాలా లాభపడతారు.


వృషభం(Taurus): శని సంచారం వృషభ రాశి వారికి కెరీర్‌లో బలమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీరు ఉద్యోగం మారకూడదనుకుంటే, మీరు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందవచ్చు. మీ పని మెరుగ్గా ఉంటుంది, ఇది మీకు ప్రశంసలను తెస్తుంది. వ్యాపారులు కొత్త పనులను ప్రారంభించవచ్చు, ఇది వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది.


ధనుస్సు (Sagittarius): శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే, ధనుస్సు రాశికి స్వేచ్ఛ లభిస్తుంది. ఇది వారికి పెద్ద ఉపశమనం. అంతే కాకుండా ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులు చాలా లాభపడతారు. మీరు అనుకోని ధనం దొరుకుతుంది.


Also Read: Kalashtami 2022: అకాల మృత్యువు నుంచి తప్పించుకోవాలంటే కాలాష్టమి వ్రతం చేయండి, ఇదే ముహూర్తం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook