Saturn Jayanti 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శని పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి. శని అంటే చాలు ప్రతికూలంగానే భావిస్తుంటారు. కానీ అదే శని గ్రహం కటాక్షం లభిస్తే మాత్రం ఇక జీవితంలో ఎన్నడూ వెనక్కు తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. భారీగా డబ్బులు వచ్చి పడుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవ గ్రహాల్లో ఒకటైన శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. చేసిన కర్మలకు ప్రతిఫలం అందిస్తాడంటారు. జ్యేష్ట అమావాస్య రోజున అంటే మే 19న శని జయంతి ఉంది. శని గ్రహం పుట్టిన రోజు. హిందూ విశ్వాసాల ప్రకారం శని గ్రహం సూర్యుడి, తల్లి ఛాయాదేవికి సుపుత్రుడు. శనిగ్రహం దృష్టి ఎవరిపై పడితే వారికి ఇక కష్టకాలమేనంటారు. అదే సమయంలో శనిగ్రహం అనుగ్రహం ఉంటే మాత్రం రాజవైభవం కలుగుతుంది. శని జయంతి రోజున శోభన యోగం ఏర్పడనుంది. ఈ సందర్బంగా శని గ్రహం తన రాశి కుంభంలో ఉంటాడు. అదే సమయంలో శశయోగం కూడా ఏర్పడనుంది. మేషరాశిలో గురువు, చంద్రుడు కలసి ఒకే సమయంలో ఉండటం వల్ల ఏర్పడే రాజకేసరి యోగం అత్యంత లాభదాయకంగా మారనుంది. ఈ రోజూన శని గ్రహానికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషం వంటివన్నీ తొలగుతాయి.


శని జయంతి రోజున శని దేవుడి కటాక్షం పొందేందుకు కొన్ని ఉపాయాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నూనె, నల్ల బట్టలు, ఇనుప వస్తువుల దానం, గొడుగు దానం చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ పనులు శనిగ్రహం ప్రసన్నతకు కారణమౌతాయి.


కోతులకు అరటి పండ్లు బెల్లం వంటివి తిన్పిస్తే మీ పాపాలు తొలగి మంచి జరుగుతుందని, అప్పుల బెడద పోతుందని నమ్మకం. శని జయంతి నాడు హనుమాన్ చాలీసా సుందరకాండ పఠనం తప్పనిసరిగా భావిస్తారు. దీనివల్ల అశుభ పరిణామాలుంటే తొలగుతాయి. పేదలకు అన్నదానం చేయాల్సి ఉంటుంది. శని దోషం నుంచి విముక్తులౌతారు. 


ఆర్ధిక సమస్యల్నించి విముక్తి పొందేందుకు స్మశానంలో కలప దానం చేస్తే మంచిది.  రావి చెట్టు దిగువన ఆవాల నూనెతో దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేయాలి.శని జయంతి రోజున ఇనుము లేదా ఇనుప వస్తువుల కొనుగోలు చేయకూడదు. 


Also read: Sun Transit 2023: ఈ 4 రాశులవారికి గుడ్‌న్యూస్, రేపట్నించి వద్దంటే వచ్చి పడే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook