Saturn Mars Conjunction 2023: జూన్ 30 వరకు ఈ రాశుల జీవితం గందరగోళం.. మీ రాశి ఉందా?
Shadashtak Yog 2023: రీసెంట్ శని మరియు అంగారకుడు కలిసి అశుభకరమైన షడష్టక యోగాన్ని సృష్టించాయి. ఈయోగం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Mars Conjunction 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడు.. శని నుండి ఆరో స్థానంలో ఉన్నాడు. దీని కారణంగా షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం చాలా అశుభకరమైనది. జూన్ 30 వరకు ఈ యోగం ఉంటుంది. ఈ యోగ సమయంలో కొన్ని రాశులవారు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి : షడష్టక యోగం వల్ల సింహరాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఆఫీసులో మీ సహచరులతో విభేదాలు వస్తాయి. వివాదాల్లో చిక్కుకుంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
ధనుస్సు: అంగారకుడు-శనిల షడష్టక యోగం ధనుస్సు రాశి వారికి సమస్యలను కలిగిస్తుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు మోసపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అస్సలు పెట్టుబడి పెట్టవద్దు.
కర్కాటకం: ఇదే రాశిలో కుజుడు ఉండటం వల్ల షడష్టక యోగం ఏర్పడుతోంది. దీని చెడు ప్రభావం కర్కాటక రాశివారిపై కనిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టవద్దు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కుంభం: కుంభరాశిలో శని ఉండటం వల్ల షడష్టక యోగం రూపొందుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీకు ఈ సమయం అస్సలు కలిసిరాదు.
Also Read: Gajakesari Yog: మరో 48 గంటల తర్వాత ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook