Shani Retrograde 2023: న్యాయదేవుడైన శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మరోవైపు అదే రాశిలో శని తిరోగమనం చేయబోతున్నాడు. జూన్ 17, రాత్రి 10.48 గంటలకు కుంభరాశిలో శనిగ్రహం రివర్స్ లో కదలనుంది. నవంబర్ 04 వరకు అదే స్థితిలో ఉంటుంది. శని వక్రీ కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులవారికి అశుభకరంగానూ ఉంటుంది. శని తిరోగమనం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
శని వక్రీ ధనస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆఫీసులో మీరు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఫ్యామిలీ సపోర్టుతో మీరు ప్రతి పనిని సులువుగా పూర్తిచేస్తారు. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
మకర రాశి
శని సంచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా అస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also read: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ రాశులవారికి చాలా ప్రమాదకరం.. ఇందులో మీరున్నారా?


సింహ రాశి
శని తిరోగమనం కారణంగా ఈ రాశి వారు వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
మీనరాశి
శని తిరోగమనం వల్ల మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. 


Also Read: Guru Pushya Yoga 2023: గురు పుష్య యోగం రోజున బంగారం కొనడం చాలా మంచిది.. కారణం తెలుసుకోండి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook