Saturn retrograde in Capricorn 2022: శని గ్రహం రేపు రాశిని మార్చబోతుంది. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని.. రేపు అంటే 12 జూలై 2022న మకరరాశిలోకి (Saturn retrograde in Capricorn 2022) ప్రవేశిస్తాడు. మకరరాశిలో తిరోగమన శని సంచార ప్రభావం మెుత్తం 12 రాశులపైన ఉంటుంది. ముఖ్యంగా 5 రాశులవారికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. మకరరాశిలో శని సంచారం కారణంగా ఈ రాశులపై శని సడేసతి మరియు ధైయా ప్రారంభమవుతుంది. 2023 జనవరి వరకు ఈ పరిస్థితి ఉంటుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై శనిమహాదశ ప్రారంభం..
శని మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే 5 రాశుల వారికి శని సడే సతి మరియు ధైయా ప్రారంభమవుతుంది, అయితే కొంతమందికి శని మహాదశ నుండి ఉపశమనం లభిస్తుంది. మకరరాశిలో శని సంచారం వల్ల ధనుస్సు, కుంభ, మకరరాశుల్లో సడే సతి మెుదలవుతుంది.  మిథున, తుల రాశుల వారికి శని దైయా ప్రారంభమవుతుంది.  మరోవైపు కర్కాటకం మరియు వృశ్చికం రాశులవారికి ధైయా నుండి విముక్తి లభిస్తుంది.  


శని సడేసతి ప్రభావం
శని సడేసతి ప్రభావం వల్ల ఈ రాశులవారు చాలా సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. శని వక్ర దృష్టి వల్ల వీరు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు. మీకు అదృష్టం కలిసిరాదు. మీ విజయ ద్వారాలు మూసుకుపోతాయి. మీరు అనారోగ్యం బారిన పడతారు. భారీగా సంపదను నష్టపోవచ్చు. ఈ సమయంలో మీరు తీవ్ర ఒత్తిడికు లోనవుతారు.


ఉపశమనం పొందడానికి పరిహారాలు
శని యొక్క చెడు దృష్టి నుండి బయట పడాలంటే మంచి పనులు చేయాలి. ఎవరితోనూ అబద్ధాలు చెప్పవద్దు, వికలాంగులను, వృద్ధులను,కార్మికులను వేధించవద్దు, వారిని అవమానించవద్దు. శనివారం నాడు రావి చెట్టు కింద ఆవాలనూనె దీపం వెలిగించండి. శనికి సంబంధించిన నూనె, నల్ల నువ్వులు, ఉసిరి, నల్లని వస్త్రాలు వంటి వాటిని దానం చేయడం వల్ల మీరు లాభ పొందుతారు. 


Also Read: Nag Panchami 2022: నాగ పంచమి ఎప్పుడు? ఆ రోజు చేయాల్సినవి, చేయకూడనవి?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook