Saturn Retrograde Effect : ఇవాళ (జూలై 12) శని గ్రహం మకర రాశిలోకి ప్రవేశించనుంది. తిరోగమన స్థితిలో కుంభరాశిలో సంచరిస్తున్న శని.. అదే స్థితిలో మకరంలోకి ప్రవేశిస్తుంది. తిరిగి వచ్చే ఏడాది జనవరి వరకు అదే రాశిలో సంచరిస్తుంది. ఈ ప్రభావం 3 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. శని మకరంలో ఉండే ఆర్నెళ్ల పాటు ఈ రాశుల వారికి శుభయోగం ఉంటుంది. ఆ 3 రాశులు... వారికి కలిగే శుభ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 3 రాశుల వారికి ఆర్నెళ్లు శుభ యోగమే.. :


వృషభం: శని మకర ప్రవేశంతో వృషభ వారికి కెరీర్‌లో కలిసొస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తగిన జాబ్ లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఒకరికి ఇచ్చే స్థితిలో తప్ప ఆశించే స్థితిలో ఉండరు.


ధనుస్సు: ఈ ఆర్నెళ్లు ధనుస్సు రాశి వారికి ధన రాశులు కురుస్తాయనే చెప్పాలి. అంటే.. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఇంట్లోకి ధన ప్రవాహం జరుగుతుంది. రావడమే తప్ప పోవడమనేది ఉండదు.వ్యాపార వర్గాలకు ఊహించిన దాని కన్నా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆ ఉత్సాహంతో వ్యాపార విస్తరణ చేపడుతారు.


మీనం: వ్యాపార వర్గాలకు ధన లాభం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. మీ మాట పట్ల అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఈ ఆర్నెళ్లు అంతా శుభమే జరుగుతుంది.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read:Guru Purnima 2022: రేపు గురు పూర్ణిమ.. ఒకే రోజు 4 రాజ యోగాలు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..  


Also Read: Supermoon 2022: రేపే అంతరిక్షంలో మరో అద్భుతం.. సముద్రాలపై తీవ్ర ప్రభావం!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook