Saturn Transit 2022: శనిగ్రహానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏకంగా 30 ఏళ్ల తరువాత జరగనున్న పరిణామమిది. ఆచితూచి అడుగేయకపోతే..సమస్యలు తీవ్రమై చుట్టుముడతాయి. తస్మాత్ జాగ్రత్త.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో ప్రతి గ్రహం ఓ నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చేస్తుంది. ఫలింగా అన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంది.  కొన్ని రాశులకు శుభంగా ఉంటే..మరికొన్ని రాశులపై అశుభంగా ఉండనుంది. గ్రహాలన్నింటిలో శనిగ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశిలో రెండవసారి ప్రవేశించేందుకు ఏకంగా 30 ఏళ్ల సమయం పడుతుంది. జనవరి 17వ తేదీన శని కుంభరాశిలో ప్రవేశించనున్నాడు.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేందుకు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. శనిగ్రహం కుంభరాశిలో వక్రమార్గం చెందనుంది. కుంభరాశి శనిగ్రహానికి మూలరాశిగా భావిస్తారు. శనిగ్రహాన్ని క్రూరగ్రహంగా పిలుస్తారు. అందుకే శని ప్రభావం ఏదైనా రాశిపై పడితే ఆ జాతకులు తీవ్ర సమస్యు ఎదుర్కోవల్సివస్తుది. జనవరి 17న శని రాశి పరివర్తనం తరువాత ఏేయ రాశుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం 30 ఏళ్ల తరువాత కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. శని ఈ రాశిలో ప్రవేశించగానే..కుంభం, మకరం, మీనరాశులపై శనిదోషం ప్రభావం పడుతుంది. కర్కాటకం, వృశ్చిక రాశి జాతకులు కూడా ఈ ప్రభావంలో పడతారు.


శని గోచారంతో ఈ రాశివారికి తీవ్రనష్టం


2023లో శని కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కర్కాటకం, వృశ్చికరాశిపై శని పీడ ప్రారంభమౌతుంది. ఈ రాశి జాతకులకు ధన, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. శనిపీడతో బాధపడుతున్నవారికి ఆర్ధిక, మానసిక, శారీరక కష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇంట్లో సుఖశాంతులు తగ్గుతాయి.


శనిపీడతో బాధపడుతున్న ఈ రాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు ఎదురౌతాయి. అంతేకాదు..ఆదాయం తగ్గిపోతుంది. ఆరోగ్యం కూడా వికటిస్తుంది. ప్రత్యేకించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.


Also read: Mangal Gochar 2022: కుజుడు చాలా ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి సంచారం.. ఈ నెల మొత్తం ఆ రాశువారు విపరీతమైన డబ్బు పొందడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook