Saturn Transit 2023: జోతిష్య శాస్త్రంలో శని దేవునికి, శని గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. శని గ్రహం ఇతర రాశుల్లోకి సంచారం చేయడం వల్ల చాలా రాశువారికి వివిధ రకాల యోగాలు ఏర్పడుతాయి. అయితే ఈ రాజ యోగాల వల్ల ఆ రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా చాలా రకాల ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి ఈ యోగాలకు కూడా జోతిష్య శాస్త్రంలో చాలా ప్రముఖ్యత ఉంది. అయితే 2023 సంవత్సరంలో శని గ్రహం సంచారం వల్ల శేష రాజ యోగం ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో చాలా రకాల రాశువారు ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా శని దేవుడి చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి ఎవరి గ్రహాల్లో పదవ స్థానంలో ఉంటుందో వారికి పంచ మహాపురుష యోగం ఏర్పడి జాతకంలో 'శష' యోగం ఏర్పుడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ యోగం ఏర్పడిన వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన ప్రయోజనాలే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఏయే రాశువారికి ఈ యోగం ఏ స్థానంలో ఏర్పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎవరి జాతకంలో శని తన సొంత రాశులనైనా మకరం లేదా కుంభరాశిలో మొదటి, నాల్గవ, సప్తమ, పదవ ఉంటాడో అప్పుడు వారి జాతాకాల్లో తీవ్ర మార్పులు సంభవించి పంచ మహాపురుష శుభ యోగం ఏర్పడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే యోగాన్ని చాలా మంది శాస్త్రాల ప్రకారం 'శష' యోగం అంటారు. ఈ యోగం 2023 సంవత్సరంలో మేష రాశి పొందబోతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ  రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడతారు.  ఉద్యోగంలో ఉన్న వారికి శుభవార్త లభించి పదోన్నతి పొందవచ్చు.


అంతే కాకుండా ధనుస్సు, కుంభ రాశుల వారికి కూడా ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా పితృ ఆస్తుల ద్వారా ధనాన్ని పొందుతారు. అంతేకాకుండా  సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందే  అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తులారాశి, వృశ్చికరాశి వారికి వారి జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే ఈ రాశులవారు కూడా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ యోగం ఏర్పడే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?


Also Read : Thalapathy Vijay No 1 Hero : అందుకే విజయ్ నెంబర్ వన్ హీరో.. బల్లగుద్ది చెప్పేసిన దిల్ రాజు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి