Saturn Transit 2023 Effects: 2023 సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాల స్థానాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఇందులో శనిగ్రహం ఒకటి. జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలోకి (Transit in Aquarius 2023) ప్రవేశిస్తుంది ఆ తర్వాత శని ఫిబ్రవరి 3న అస్తమిస్తుంది. 15 రోజులలోపు శని గ్రహ స్థితిలో రెండుసార్లు మార్పురావడం ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్నే చూపుతుంది. శని సంచారం మరియు అస్తమించడం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): 2023లో శని రాశి మారడం ఆపై శని అస్తమించడం వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సమాజంలో మీపై గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులు బాగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  


తుల రాశి (Libra): శనిదేవుడికి ఇష్టమైన రాశుల్లో తుల కూడా ఒకటి. అందుకే శని గ్రహం మార్పులు ఈరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. విద్యార్థులు పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌ పొందుతారు. నిరుద్యోగులు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.


మకరం (capricorn): వచ్చే ఏడాది ప్రారంభంలో శనిగ్రహం మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించి అస్తమిస్తుంది. దీంతో ఈరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. 


Also Read: Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు? దీని విశిష్టత ఏంటో తెలుసుకోండి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook