Shani Gochar 2024 effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతారు. ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. సాధారణంగా శనిదేవుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు. మెుత్తం 12 రాశులలో సంచరించడానికి శనీశ్వరుడికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది కూడా ఇదే రాశిలో ఉంటాడు. 2024 సంవత్సరంలో శని యెుక్క గమనంలో పెను మార్పులు రానున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారు లాభపడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
వచ్చే ఏడాది మెుత్తం మేషరాశి వారికి శనిదేవుడు అనుగ్రహం ఉంటుంది. వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. 
తులారాశి
తులారాశి వారికి ఎల్లప్పుడూ శనిదేవుడు కటాక్షం ఉంటుంది. వచ్చే ఏడాది అంతా ఏదో విధంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉద్యోగస్తులు మంచి పొజిషన్ కు వెళతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి. మీ కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
కర్కాటక రాశి
2024 సంవత్సరం కర్కాటక రాశి వారి జీవితాల్లో శనిదేవుడు కాంతులు నింపుతాడు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. మీరు చదువు లేదా జాబ్ లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. 


Also Read: Shani Dev: శని సాడే సతి ఈ రాశుల వారికి మొదటి, చివరి దశలు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి