Saturn transit 2023 to 2025: పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యదేవుడు కుమారుడు. ఇతడు మనిషి చేసే పనులను బట్టి ఫలాలను ఇస్తాడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని వక్ర దృష్టి పడితే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శనిదేవుడు 2025 సంవత్సరం వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో అతడు కొందరిపై శుభ మరియు అశుభ ప్రభావాన్ని చూపుతుంది. శని సంచారం 2025 వరకు ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సంచారం ఈ రాశులకు వరం
తుల రాశి: శని కదలిక వల్ల తులరాశి వారికి 2025 వరకు కలిసి వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. మీకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం పెరుగుతుంది. స్థిరచరాస్తులు లభిస్తాయి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. 
సింహ రాశి: శని సంచారం మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు పనిలో అదృష్టం కలిసి రావడంతో పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 
వృషభం: కుంభరాశిలో శని సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 


Also Read: Grah Gochar 2023: ఆగస్టులో అరుదైన యోగం.. అదృష్టం వరించబోయే రాశులివే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook