Saturn transit 2023-2025: మనం చేసే మంచి, చెడు పనుల ఆధారంగా ఫలాలను ఇచ్చేవాడు శని. అందుకే ఇతడిని  న్యాయధీశుడు, కర్మదాత అని పిలుస్తారు. అష్ట గ్రహాల్లో శని కూడా ఒకడు. సాధారణంగా శని రెండున్నర సంవత్సరాలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇతడి రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో రివర్స్ లో కదులుతుంది. శనిదేవుడు 2025 వరకు అదే రాశిలో ఉంటాడు. శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల రాశి : శని రాశి మార్పు తులా రాశి వారి ఇబ్బందులన్నింటినీ తొలగిస్తుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు మంచి రోజులు మెుదలవుతాయి. సంపాదన పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దాంపత్య జీవితంలో సుఖం ఉంటుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. 
ధనుస్సు: శని గమనంలో మార్పు ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 
మిథునం: శనిదేవుడి సంచారం మిథునరాశి వారికి అదృష్టాన్నిస్తుంది. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. వ్యాపారంలో రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: Mars transit 2023: ఆగస్టు 18 నుండి ఈ 4 రాశుల సుడి తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?


కన్య: శని సంచారం కన్యారాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 


Also Read: Venus transit 2023: ఈ 5 రాశుల వారికి మహార్దశ.. అక్టోబరు 2 వరకు వీరు పట్టిందల్లా బంగారం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి