Shani Margi 2022: ఏదైనా గ్రహం యెుక్క సంచారం లేదా తిరోగమనం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. జూలైలో శనిదేవుడు తిరోగమనం చేశాడు. నాలుగు రోజుల కిందట అక్టోబరు 23న శనిదేవుడు మకరరాశిలో సంచరించాడు. దీంతో కొన్ని రాశులవారికి శనిదేవుడి దయతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. శనిదేవుడు సంచారం (Shani Margi 2022) ఏరాశివారికి లాభమో, ఏ రాశివారికి నష్టమో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): ఈ రాశి వారికి సమయం ఇబ్బందికరంగా ఉంటుంది. కష్టాలు పెరగవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ధన వ్యయం పెరుగుతుంది. 
వృషభం (Taurus): శని మార్గంలో ఉండటంతో మీకు కష్టాలు పెరుగుతాయి.  జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి పెరగవచ్చు.
మిధునరాశి (Gemini): ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సోమరితనం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అత్తమామల వైపు నుండి ఇబ్బందులు ఎదురవ్వచ్చు.
కర్కాటకం (Cancer): మీరు వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. 
సింహరాశి (Leo): కెరీర్‌లో మంచి అవకాశాలను పొందుతారు. ఎవరైనా చెడు సలహా ఇవ్వగలరు. ఇది నష్టం కలిగించవచ్చు. 


కన్య (Virgo):  కెరీర్‌లో సమస్యలు రావచ్చు. మీ పనిలో అడ్డంకులు ఉంటాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. తోబుట్టువులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించవచ్చు.
తులారాశి (Libra):  ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదుర్చుకోవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio): కెరీర్ లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా నడవాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


Also Read: Budh Gochar 2022: నవంబర్ 13 వరకు ఈ 5 రాశులపై బుధుడి అనుగ్రహం.. ఇందులో మీ రాశి కూడా ఉందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook