Saturn Transit 2023: మరి కొద్దిరోజుల్లో దీపావళి ఉంది. దీపావళి కంటే ముందు శని గ్రహం స్థితిలో రెండు కీలకమైన మార్పులు రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి శని నక్షత్ర పరివర్తనం జరగనుంది. ఆ తరువాత అంటే నవంబర్ 4న శని సక్రమమార్గం ఉంటుంది. శని గ్రహంలో జరగనున్న ఈ మార్పులు 5 రాశులపై ప్రభావం చూపించనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం కదలికను జ్యోతిష్యలు జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఎందుకంటే శని గ్రహం స్థితిలో జరిగే మార్పు ప్రతి రాశిపై ఎంతోకొంత ప్రభావం చూపిస్తుంటుంది. ఈ ఏడాది నవంబర్ 12 వ తేదీ దీపావళి పండుగ ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఫలితంగా ఏడాదంతా లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో ధన సంపదలు వచ్చి పడతాయని ఆశిస్తారు. ఉత్తరాదిన దీపావళి చాలా పెద్ద పండుగ. ఈసారి దీపావళి చాలా ప్రత్యేకం కానుంది.  ఎందుకంటే దీపావళి కంటే ముందు శని గ్రహం స్థితిలో మార్పు రానుంది. అక్టోబర్ 15న శని గ్రహం నక్షత్ర మార్పుతో పాటు నవంబర్ 4 నుంచి శని సక్రమమార్గం ఉంటుంది. శనిగ్రహం స్థితిలో జరిగే ఈ మార్పుల కారణంగా 5 రాశులకు అత్యంత శుభప్రదం కానుంది. ఊహించని లాభాలు కలగనున్నాయి. 


శని గ్రహంలో జరిగే మార్పు కారణంగా కన్యా రాశి జాతకంలో కీలకపరిణామాలు చోటుచేసుకోవచ్చు. ఈ రాశి వారికి అంతా సానుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. అదే సమయంలో ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. పనిచేసేచోట గౌరవం ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. 


ధనస్సు రాశి జాతకులకు శని గ్రహం స్థితిలో మార్పు కారణంగా ఊహించని లాభాలు కలగనున్నాయి. కష్టమనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాలు కలిగితే ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారం విస్తారమౌతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. 


శని నక్షత్ర పరివర్తనం ప్రభావం మేష రాశి జాతకులపై సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. చాలాకాలంగా పెండింగులో ఉన్న డబ్బులు చేతికి తిరిగి అందుతాయి. వ్యాపారంలో అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. కొత్త ఇళ్లు లేదా కొత్త వాహనం కొనే అవకాశముంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.


మిధున రాశి జాతకులకు శని గ్రహంలో మార్పు ప్రభావం కీలకం కానుంది. ఈ రాశి వారు చాలా విషయాల్లో శుభవార్త వింటారు. వ్యాపారులైతే ఊహించని లాభాలు ఆర్జిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగ మార్పు లేదా స్థాన చలనం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. ఇళ్లు లేదా వాహనం కొనుగోలు ఉంటుంది. 


శని గ్రహం స్థితిలో మార్పు ప్రభావం వృషభ రాశి జాతకులకు చాలా బాగుంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఎక్కడైనా పెండింగులో ఉన్న లేదా రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగ మార్పు ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లాభించవచ్చు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. 


Also read: October Horoscope 2023: ఈ 4 రాశులకు రానున్న 22 రోజులు కనకవర్షమే, మీ రాశి ఉందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook