Shani Uday effect on zodiac signs: మార్చి 5వ తేదీ శనివారం నాడు శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. జనవరి 30న శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. శని రైజింగ్ వల్ల కొన్ని రాశులవారికి శుభ యాదృచ్చికం జరగబోతుంది. అయితే శనితోపాటు సూర్యుడు మరియు బుధుడు కూడా అదేరాశిలో ఉన్నారు.  దీని కారణంగా కొన్ని రాశులవారిపై శనిదేవుడు చెడు ప్రభావాన్ని చూపనున్నాడు. వీరి జీవితాన్ని కష్టాలమయం చేయనున్నాడు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు కష్టకాలం
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని ఉదయించడం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడికి ఇది సరైన సమయం కాదు. మీ ఫ్యామిలీతో విభేదాలు రావచ్చు. మీరు చేపట్టినా పనిని విజయవంతంగా పూర్తి చేయలేరు. 
కన్యారాశి
శనీశ్వరుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారు ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది, అయితే సహోద్యోగుల వల్ల సమస్యలు రావచ్చు. ఈ టైంలో మాటలను అదుపులో ఉంచుకోండి. మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే కొంత కాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. 
వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారికి శని ఉదయించడం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. మీకు ఆఫసీసులో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా సోదరులతో ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ దాంపత్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
మకరరాశి
శని మీ రాశిలో రెండవ ఇంట్లో ఉంటాడు.  వృత్తి జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోంటారు. దీని కారణంగా మీ కుటుంబంలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఆస్తి విషయంలో తోబుట్టువులతో వివాదాలు రావచ్చు. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
మీనరాశి
శని మీ రాశి నుండి పన్నెండవ ఇంట్లో ఉంటాడు. మీ వైవాహిక జీవితంలో అపార్థాలు వస్తాయి. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. మీ ఖర్చులను తగ్గించుకోండి. మీ మనసు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోంటారు. 


Also Read: Monthly Horoscope: మార్చి నెలలో అదృష్ట రాశులు ఇవే... ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook