Lord Shiva Fav Zodiac Sign: హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. నేటి(జూలై 4) నుండి శ్రావణ మాసం మెుదలుకానుంది. ఎప్పుడూ లేని విధంగా శ్రావణం రెండు నెలలపాటు ఉండనుంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. మహాదేవుడి అనుగ్రహం ఉండే ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
మేష రాశి వారికి శ్రావణ మాసం చాలా ప్రత్యేకం. వీరిపై శివుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆఫీసు ఒత్తిడి నుండి బయటపడతారు. అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. 
ధనుస్సు రాశి
శివుని అనుగ్రహంతో ధనుస్సు రాశి వారికి ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది.
సింహరాశి 
ఈ రాశికి అధిపతి సూర్యదేవుడు. పైగా పరమశివుడికి భక్తుడు. శ్రావణ మాసం మెుత్తం సింహరాశి వారు శుభఫలితాలనే పొందుతారు. మీకు నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. లవ్ సక్సెస్ అవుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also Read: Surya Gochar 2023: సింహరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..


తులారాశి
తుల రాశి వారిపై శివుడి అనుగ్రహం ఉంటుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


Also Read: Shani Vakri 2023: రివర్స్ లో కదులుతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK