Scorpio Zodiac Sign peoples will get love marriage due to Niyati Palat Rajyog 2023: జ్యోతిష్యశాస్రం ప్రకారం... శ్రేయోభిలాషి మరియు ఆనందాన్ని అందించే శుక్ర గ్రహం ఫిబ్రవరి 15 (శుక్ర గోచారం 2023) న సంచరించబోతోంది. శుక్రుడు త్వరలో మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే  మీన రాశిలో బృహస్పతి ఉంది. శుక్రుడు మరియు బృహస్పతి కలయిక కారణంగా అరుదైన మరియు శుభప్రదమైన 'నియతి పాలత్ రాజ్యయోగం' ఏర్పడనుంది. ఈ అరుదైన రాజయోగం వల్ల ఈ 4 రాశుల వారి జీవితాల్లో సంతోషం రాబోతుంది. పేదరికం పోవడమే కాకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆ 4 అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారి జాతకంలో 5వ భాగంలో 'నియతి పాలత్ రాజ్యయోగం' ఏర్పడుతుంది. ఇది ప్రేమ వివాహం, పిల్లలు, పురోగతి మరియు ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. కాబట్టి శుక్ర సంచారం వలన వృశ్చిక రాశి వారికి ధనలాభం కలుగుతుంది. ప్రేమలో ఉండి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకునే వారు.. శుక్ర సంచారం తర్వాత కుటుంబసభ్యులతో ఈ విషయం మాట్లాడుకోవచ్చు.


కర్కాటక రాశి:
నియతి పాలత్ రాజయోగం ఏర్పాటుతో కర్కాటక రాశి వారి జీవితంలో బంగారు దశ ప్రారంభం కానుంది. కర్కాటక రాశి వ్యక్తులు ఆకస్మిక ధనలాభాలను పొందవచ్చు. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. హోటల్-రెస్టారెంట్‌లతో అనుబంధించబడిన వ్యక్తులు మరిన్ని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. పాత రోగాల నుంచి ఉపశమనం ఉంటుంది.


కన్యా రాశి:
కన్యా రాశి వ్యక్తులకు శుక్రుని సంచారము అనేక కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. జీవితంలో జరుగుతున్న వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ​​ఉంటుంది. ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. భాగస్వామితో కలిసి చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది. ధనం పొందేందుకు కొత్త వనరులు ఏర్పడతాయి. పెట్టుబడి పెట్టవచ్చు.


మిథున రాశి:
శుక్ర, గురు గ్రహాల ప్రభావం కారణంగా మిథున రాశి వారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ ఉండవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తుల అన్వేషణ పూర్తవుతుంది. కోర్టుకు సంబంధించిన పాత కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో ఏదైనా శుభ కార్యం జరగవచ్చు. కుటుంబంతో కలిసి బయట ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.


Also Read: Layoffs 2023: ఇంటెల్‌ కీలక నిర్ణయం.. లే ఆఫ్‌లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు


Also Read: IND vs NZ: శుభ్‌మన్‌ గిల్ సెంచరీ.. మూడో టీ20లో భారత్ ఘన విజయం! 2-1తో సిరీస్‌ కైవసం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.