Surya Grahan 2023: ఈ నెలలోనే రెండో సూర్య గ్రహణం... గ్రహణ సమయం తెలుసుకోండి...
Solar eclipse 2023: సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ నెల 14న రెండవ లేదా చివరి సూర్యగ్రహణం సంభవించబోతుంది.
Surya Grahan 2023 date: ఈ ఏడాది ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు సంభవించాయి. ఈ సంవత్సరం రెండవ లేదా చివరి సూర్యగ్రహణం అక్టోబరు 14, శనివారం నాడు ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ఉదయం 08:34 గంటలకు ప్రారంభమై 02:25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, అంటే సూతక్ కాలం కూడా చెల్లదు. సూర్యగ్రహణం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగానూ ఉంటుంది.
సూర్యుడు మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇప్పడు ఏర్పడబోయేది కంకణాకార సూర్యగ్రహణం. అంటే దీనిలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు మరియు సూర్యుని వెలుపలి భాగం కంకణం వలె కనిపిస్తుంది. ఈ రెండో సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, కెనడా, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్, పెరూ, ఉరుగ్వే, ఆంటిగ్వా మరియు ఇతర దేశాలలో కనిపిస్తుంది.
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం ఉండదు. సుతక్ కాలం సమయంలో ఎలాంటి పూజలు కానీ, శుభ కార్యాలు కానీ జరగవు. దేవాలయాలు మూసి ఉంచాలి. గ్రహణ సమయంలో తినడం, త్రాగడం వంటి పనులు చేయకూడదు. గర్భిణులు ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే పుట్టబోయే పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం.
Also Read: Indian Railways: వైష్ణోదేవికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్, ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook