Surya Grahan 2023: త్వరలో రెండవ సూర్యగ్రహణం... ఈ రాశుల వారిపై చెడు ప్రభావం..
Solar Eclipse 2023: ఈ ఏడాది రెండవ లేదా చివరి సూర్యగ్రహణం త్వరలో ఏర్పడబోతుంది. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Surya Grahan 2023 effect on Zodiac Signs: సైన్స్ లో గ్రహణం కేవలం ఖగోళ దృగ్విషయంగా పరిగణించబడుతుంది. కానీ ఆస్ట్రాలజీలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడల్లా అది అన్ని రాశిచక్రగుర్తులను ప్రభావితం చేస్తుంది.
2023 సంవత్సరంలో రెండు సూర్య మరియు రెండు చంద్ర గ్రహణాలు సంభవించాల్సి ఉంది. వాటిలో ఒక సూర్య మరియు ఒక చంద్ర గ్రహణం ఇప్పటికే ఏర్పడ్డాయి. ఇంకా 1 సూర్యగ్రహణం మరియు 1 చంద్రగ్రహణం జరగాల్సి ఉంది. ఈ సంవత్సరంలో చివరి మరియు రెండవ గ్రహణం అక్టోబర్ 14, 2023న ఏర్పడబోతుంది. ఇది వార్షిక సూర్యగ్రహణం అవుతుంది. ఇందులో సూర్యుడు పూర్తిగా కప్పబడకుండా ఉంగరం ఆకారంలో కనిపిస్తాడు కాబట్టి శాస్త్రంలో ఈ రకమైన గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.
భారత కాలమానం ప్రకారం, సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023 రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2.25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ఆఫ్రికాలోని పశ్చిమ భాగం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్‌లలో కనిపిస్తుంది.
ఈ రాశులవారిపై ప్రతికూల ప్రభావం
తులారాశి
సూర్యగ్రహణం తుల రాశి వారిపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రవర్తన ఇతరులకు చికాకు కలిగించవచ్చు. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి.
మేష రాశి
ఈ సూర్యగ్రహణం మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీరు సన్నిహితుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్రమత్తంగా ఉండండి.
వృషభం
సూర్యగ్రహణం వల్ల వృషభ రాశి వారికి ధన నష్టం కలుగుతుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎలాంటి వివాదాల జోలికి పోకండి.
కన్య
కన్యారాశి వారికి కూడా సూర్య గ్రహణం అశుభ ఫలితాలనే ఇస్తుంది. మీకు బంధువులు మరియు స్నేహితులతో విభేదాలు ఉండవచ్చు. ఈ సమయంలో కోపం తెచ్చుకోకండి, వాదించకండి.
Also Read: Shukra Gochar 2023: శుక్రుడి సంచారంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook