September grah gochar 2022: సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో మార్పు రానుంది. కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చనున్నాయి. వీటి సంచార ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది.  సెప్టెంబర్‌లో ఏయే గ్రహాలు తమ రాశిని మార్చనున్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ వక్రి 2022: కన్యా రాశికి అధిపతి బుధుడు. ప్రస్తుతం అదే రాశిలో ఉన్నాడు. సెప్టెంబరు 10న బుధుడు కన్యా రాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, బుధ వక్రి కొన్ని రాశులవారికి ఇబ్బందులు తెస్తుంది. బుధ గ్రహం యొక్క అశుభాలను తగ్గించడానికి వినాయకుడిని పూజించాలి. 


శుక్రుడు అస్తమయం 2022: శుక్రుడు...ప్రేమ, శృంగారం, అందం, లగ్జరీ లైఫ్ కు కారకుడు. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సెప్టెంబరు 15న శుక్రుడు సింహరాశిలో అస్తమించనుంది. శుక్రుడు అస్తమించినప్పుడు పూర్తి ఫలితాలు ఇవ్వలేడు. శుక్రుని అశుభ ప్రభావాలు తగ్గించడానికి తెల్లని వస్తువులు దానం చేయడం, ఆడపిల్లలకు కానుకలు మొదలైనవి ఇవ్వాలి.


సూర్య సంచారం 2022: గ్రహాల అధిపతి సూర్యుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. సెప్టెంబర్ 17న శుక్రుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో సూర్య సంచారం శుభఫలితాలను ఇస్తుంది. 


శుక్ర సంచారం 2022: సెప్టెంబర్ నెల చివరి గ్రహ మార్పు కన్యారాశిలో కనిపిస్తుంది. సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల లాభం ఉంటుంది. 


Also read: Lord Ganesha: వినాయకుడికి ఫేవరెట్ రాశులివే.. కారణం ఇదే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook