September Planet Transits 2022: సెప్టెంబరులో కొన్ని ప్రధాన గ్రహాలు రాశిని మార్చనున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చనుండగా.. బుధుడు తిరోగమనం చేయనున్నాడు. వీటి సంచారం ప్రభావం ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబరు 10న బుధుడు కన్యారాశిలో తిరోగమనం చేయనుండగా...సెప్టెంబరు 17న శుక్రుడు సింహరాశిలో ఆస్తమిస్తాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 24న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం సెప్టెంబరు 24న శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తాడు. వీటి సంచార ప్రభావం, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ నెలలో కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini): పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు సహోద్యోగుల నుంచి సపోర్టు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. పెట్టుబడి పెట్టే వారికి ఇది అనుకూల సమయం. 


కర్కాటకం (Cancer): ఈ రాశివారికి లక్ష్మదేవి కటాక్షం ఉంటుంది. ఈ సమయంలో ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేశారు. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


వృశ్చికం (Scorpio):  ఈ రాశివారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారుల లాభపడతారు. టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 


Also Read: Mars Transit in Gemini 2022: కుజుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారి లైఫ్ అదుర్స్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook