Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏడు శుభ యోగాలు.. ఈరోజు ఏ పని చేపట్టినా 3 రెట్లు లాభం..

Akshay Tritiya 2023 Shubh Yog: హిందూ మతంలో అక్షయ తృతీయను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున 7 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు ఏ పని తలపెట్టినా దాని ప్రాముఖ్యత అనేక రెట్టు పెరుగుతుంది.
Akshay Tritiya 2023 Shubh Yog: హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ అక్షయ తృతీయ రోజునే విష్ణువు చాలా అవతారాలు ఎత్తారని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయను గ్రంధాలలో ఉగాది తిథి అని కూడా అంటారు.
హిందూ మతంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈసారి అక్షయ తృతీయను ఏప్రిల్ 22వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. మన తెలుగు లోగిళ్లలో ఈరోజునే బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈ పవిత్ర దినాన వివాహం, గృహ ప్రవేశం, కొత్త ఇల్లు లేదా కారు కొనడం, కొత్త ఉద్యోగం ప్రారంభించడం వంటి శుభకార్యాలు చేస్తారు. ఈ శుభ దినాన ఏ పని చేపట్టినా శుభ ఫలితాలను పొందుతారు.
ఈ అక్షయ తృతీయ రోజున చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు. ఈరోజున కృత్తిక నక్షత్రం ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున ఆయుష్మాన్ యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, అమృత సిద్ధి యోగం, త్రిపుష్కర యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ రోజు చేసిన పనికి అనేక రెట్లు శుభ ఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 7.50 గంటలకు ప్రారంభమై 23వ తేదీ ఉదయం 7.48 వరకు కొనసాగుతుంది. అక్షయ తృతీయ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, హవనం చేయడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతే కాకుండా ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానధర్మాలు చేయండి.
Also Read: Guru Gochar 2023: మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్న గురుడు.. ఈ 4 రాశుల కెరీర్ అద్భుతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి